ETV Bharat / entertainment

బాలయ్య 'ఆదిత్య 369'పై నాసా ప్రశంసలు.. ఏమందంటే?

బాలకృష్ణ నటించి ఆదిత్య 369 అప్పట్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా కోసం బాలయ్యనే ఎందుకు ఎంచుకున్నారు? ఆదిత్య 369 అనే టేటిల్​ను ఎందుకు పెట్టారు? ఈ మూవీ చూసిన నాసా ఏమని చెప్పింది? వంటి విషయాలను తెలుసుకుందాం.

Alitho saradaga  Balakrishna Aditya 369
ఆలీతో సరదాగా ఆదిత్య 369
author img

By

Published : Sep 6, 2022, 11:51 AM IST

ఆలీతో సరదాగా ఆదిత్య 369

Nasa praises on Balakrishna 369 movie: వైవిధ్య చిత్రాలను ప్రేక్షకులకు చూపించాలని తపన పడే దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన క్లాసిక్‌ మూవీ 'ఆదిత్య 369'. సైన్స్‌ ఫిక్షన్‌, సోషియో ఫాంటసీ, చరిత్ర ఈ మూడింటిని మేళవించి తెరకెక్కిన చిత్రమిది. అప్పట్లో ఈ మూవీ టాలీవుడ్‌లో సంచలనాలు సృష్టించి.. తెలుగు సినిమాకు ఒక మైలురాయిగా నిలిచింది. అయితే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సింగీతం శ్రీనివాసరావు.. ఆదిత్య 369 సినిమాను బాలకృష్ణతోనే ఎందుకు తీశారు? 'ఆదిత్య 369' అనే టైటిల్​ ఎందుకు పెట్టారు? ఈ సినిమాను చూసిన నాసా ఏమని ప్రశంసించింది? ఈ చిత్రం సీక్వెల్​.. వంటి విషయాలు గురించి మాట్లాడారు.

"బాలకృష్ణ మూడు చిత్రాలు చేశాను. ఆదిత్య 369 విషయానికొస్తే.. భవిష్యత్​, వర్తమానం ఎవరైనా చేస్తారు. గతంలోకి వెళ్లాలంటే ఇంట్రెస్టింట్ టాపిక్​ తీసుకోవాలి. ఓ కథగా, జనరంజికంగా ఉండాలంటే రెండే రెండు కాలాలు ఉన్నాయి. ఒకటి శ్రీకృష్ణదేవరాయలు, అక్బర్​ కథ. ఇలాంటి కథలు బాలకృష్ణ అయితేనే కరెక్ట్​. అలా శ్రీకృష్ణదేవరాయలను ఎంచుకుని బాలకృష్ణను తీసుకున్నాను" అని సింగీతం అన్నారు.

నాసా ప్రశంసలు.. "ఇక్కడి వాళ్లు నాసాలో ఉన్నారు. ప్రపంచంలోనే ఉన్న టైమ్​ మెషీన్​ సినిమాలన్నింటినీ చూశారు. అందులో ఆదిత్య 369 అనేది పర్​ఫెక్ట్​ టైమ్​ మెషీన్​ అని కితాబిచ్చారు. నాకు కాలేజ్​ డేస్​ నుంచి సైన్స్​ ఫిక్షన్​ అంటే ఇంట్రెస్ట్​. కానీ సైన్స్, ​ టెక్నాలజీ అంతా తెలిసి చేయలేదు. కానీ బాగా వచ్చింది. అందుకే వాళ్లు నన్ను ప్రశంసించారు" అని సింగీతం పేర్కొన్నారు.

అందుకే ఈ టైటిల్​.. "మాములుగా ఆదిత్య అని పెడితే హీరో పేరు. లేదా ఇంకేదో అనుకుంటారు. అదే 369 అని పెడితే డిఫెరెంట్​గా ఉంటుంది. నాకు నచ్చింది. 9 నెంబరు కూడా నాకు లక్కీ. అలా ఈ టైటిల్​ ఖరారు చేశాం. ఈ సీక్వెల్​ ఆదిత్య 999 పేరుతో చేస్తున్నాం. కొన్ని కారణాల వల్ల ఆగుతూ వస్తోంది. బాలయ్య తప్పకుండా చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఆయన ఎప్పుడూ ఓకే అంటే అప్పుడూ తప్పకుండా తెరకెక్కుతుంది. స్క్రిప్ట్​ కూడా రెడీగా ఉంది." అని సింగీతం వెల్లడించారు.

Alitho saradaga  Balakrishna Aditya 369
ఆలీతో సరదాగా ఆదిత్య 369

కాగా, ప్రస్తుతం బాలయ్య గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో ఎన్​బీకే 107 చిత్రం చేస్తున్నారు. శ్రుతిహాసన్​ హీరోయిన్​. వరలక్ష్మీ శరత్​కుమార్​ కీలక పాత్ర పోషిస్తుండగా.. దునియా విజయ్​ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత అనిల్​రావిపూడితో బాలయ్య ఓ సినిమా చేయనున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన ఓ గ్లింప్స్​ విడుదలై ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇదీ చూడండి: రేణు దేశాయ్ ఫ్యామిలీ​ బ్యాక్​గ్రౌండ్​ తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.