ETV Bharat / entertainment

కోప్పడిన డైరెక్టర్​.. అలిగి షూటింగ్​కు​ రానన్న కమల్​హాసన్​.. ఏం జరిగింది? - డైరెక్టర్​పై అలిగిన కమల్​హాసన్​

షూటింగ్​ సమయంలో డైరెక్టర్​ కోప్పడం వల్ల యూనివర్సల్​ స్టార్​ కమల్​హానస్​ అలిగారట. చిత్రీకరణలో పాల్గొననని తన అసిస్టెంట్‌కు చెప్పి.. ఆ విషయాన్ని దర్శకుడికి తెలియజేమన్నారట. ఇంతకీ ఏం జరిగిందంటే.

kamalhassan
కమల్​హాసన్​
author img

By

Published : Sep 7, 2022, 11:14 AM IST

Updated : Sep 7, 2022, 11:39 AM IST

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమాలలో 'సొమ్మొకడిది సోకొకడిది' ఒకటి. యూనివర్సల్​ స్టార్ కమల్​హాసన్ - జయసుధ కాంబినేషన్​లో రూపొందిన ఈ సినిమా 1979లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న సింగీతం ఈ సినిమాకి సంబంధించిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు.

కమలహాసన్‌తో చాలా సినిమాలు చేశారు. సొమ్మొకడిది..సోకొకడిదిలో ఒక విషయంలో బాగా అలిగారట ఎందుకు..? అని అడగగా ఈ సమాధానమిచ్చారు. "కమల్‌తో ఏడు సినిమాలు చేశా. అందులో సొమ్మొకడిది..సోకొకడిది ఒకటి. సముద్రం ఒడ్డున ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. కమల్‌, జయసుధ డ్యూయెట్‌ అది. 3 గంటలకల్లా వచ్చేయాలి. 4.30 గంటలకు కూడా రాలేదు. 'ఎండపోతోంది' అంటూ గట్టిగా అరిచా. ఎవరో వెళ్లి కమల్‌హాసన్‌ను తిడుతున్నట్టు చెప్పారు. నేరుగా వచ్చి కూర్చున్నారు. 'నాకు కోపంగా ఉంది. నేను షూటింగ్‌కు రానని డైరెక్టర్‌కు చెప్పండ'ని అసిస్టెంట్‌కు చెప్పాడు. 'నా కోసం, నీకోసం సూర్యుడు ఉండడు. మళ్లీ రేపు రావాలి కదా' అనే సరికి అంతా వచ్చేశారు. అయితే లొకేషన్​కు వచ్చిన కమల్​ దూరంగా కుర్చీలో కూర్చున్నారు. చిన్నపిల్లాడు మాదిరిగా అలిగి కూర్చున్నారు. దాంతో నేను ఆయన దగ్గరికి వెళ్లి 'ఏమైంది సార్' అని అడిగాను. 'మీరు అందరి ముందు నన్ను తిట్టారట. అందువలన నాకు కోపం వచ్చింది .. నేను షూటింగ్ చేయను' అన్నారు. 'అలా అని మీకు ఎవరు చెప్పారు సార్ .. నేను మిమ్మల్ని ఏమీ అనలేదు. ఒక వైపున ఎండపోతోంది .. సూర్యుడు ఎవరి కోసమూ వెయిట్ చేయడు. ఆ టెన్షన్ లో చిరాకుపడ్డాను అంతే .. ఒకవేళ మీరు హర్ట్ అయితే సారీ' అన్నాను. 'అయితే మీరు నన్ను తిట్టలేదా?' అని ఆయన అంటే ' అలాంటిదేం లేదు సార్' అన్నాను. 'అయితే పదండి' .. అంటూ ఆయన షూటింగ్​ పాల్గొన్నారు. ఆ సంఘటన తర్వాత నేను కమల్​ ఇప్పటివరకూ ఇద్దరం మంచి స్నేహితులముగానే ఉన్నాం. ఒకరిపై ఒకరం జోకులు వేసుకుంటాము. నవ్వుకుంటాము" అంటూ చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: 'ప్రాజెక్ట్​ కె' అద్భుతం​.. అక్కడ ఎన్టీఆర్​ను అలా చూసి వారంతా షాక్​

Last Updated : Sep 7, 2022, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.