'మీ శిష్యులు ఎంతమంది సంగీత దర్శకులు అయ్యారు?' అని అలీ అడగ్గా.. "చాలామంది ఉన్నారు. హేరిస్ జయరాజ్, దేవీశ్రీ ప్రసాద్, తమన్.. వీళ్లందరూ నా దగ్గర చేసినవాళ్లే. దేవీ శ్రీ ప్రసాద్‌ను సింగర్ చేసింది కూడా నేనే అనుకుంటా. వీళ్లందరిలో జీరో నుంచి వచ్చిన వ్యక్తి మాత్రం తమన్. తన సహనమే అతడిని ఇంతవాడిని చేసింది. నా దగ్గర ఉన్నప్పుడు పని ఒత్తిడిలో నేను ఏది ఉంటే అది విసిరేసేవాడిని. టీవీ వెనక్కి వెళ్లి దాక్కునేవాడు. ఇక శివమణి ఏది దొరికితే దానితో వాయించేస్తాడు. ఫ్లైట్ ఎక్కినప్పుడు చేతిలో స్టిక్స్ ఉంటే వాటితోనే అద్భుతం చేస్తాడు. ప్లైట్ ఎక్కినవాళ్లందరూ క్లాప్స్ కొట్టేవాళ్లు." అని పేర్కొన్నారు. దీంతో పాటే మరి కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
'మీ దగ్గరకు తమన్ వస్తుంటే చాలా మంది తనని తీసుకోవద్దని ఫోన్‌చేసి చెప్పేవారట?'.. పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ కొందరు భయపడ్డారు. ఎవరితో ఎలా పనిచేయించుకోవాలో నాకు తెలుసు. వాళ్లపేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ, నేను ఎలా పని చేస్తాను అని నాకు మాత్రమే తెలుసు అని చెప్పారు.
'తమన్ వచ్చాక మణిశర్మ అవసరం లేదనుకునే వాళ్లకి మీ సమాధానం ఏంటి?'.. "నాకు తెలీదు. అది టైమింగ్ అంతే. అన్ని సినిమాలు నేనొక్కడినే చేయాలి అనుకోను. నాతో పాటు అందరూ చేయాలనుకుంటాను. అలా చేస్తేనే జనాలకు కూడా కొత్తదనం అందుతుంది. అలా మాత్రమే ఆలోచిస్తా. బహుశా వాళ్లకి బోర్ కొట్టిందేమో నా సంగీతం." అని పేర్కొన్నారు.
ఏఆర్ రెహమాన్‌తో ఉన్న స్నేహబంధం గురించి మాట్లాడుతూ.. రెహమాన్ నన్ను 'ఓయ్' అని పిలుస్తారు. నాకు పాటలు పాడడం కూడా నేర్చుకోమని సలహా ఇచ్చారు. మేమిద్దరం కలిసి చాలా సినిమాలకు పనిచేశాం. రెహమాన్ నాకంటే గొప్ప ప్లేయర్. అందులో ఏ సందేహం లేదు. అప్పుడప్పుడు కలుస్తుంటాం. ఏదైనా అవసరం అయితే మెసేజ్ చేస్తా. చూసుకొని ఫోన్ చేస్తారు. తనకు ఆస్కార్ వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. తను ఆస్కార్‌కు అర్హుడు. ఇప్పటి వరకు ఎంతమంది దగ్గర వర్క్ చేశానో లెక్కపెట్టలేదు. కీరవాణి గారికి 100 సినిమాల దాకా పనిచేసి ఉంటా. నేను సంగీత దర్శకుడిని అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను ఆర్జీవీ బలవంతంగా దర్శకుడు అయ్యేలా చేశారు(నవ్వుతూ)." అని చెప్పుకొచ్చారు.
ఇదీ చూడండి: ఆ నటితో పెళ్లి.. కానీ జాన్వీతో కలిసి జిమ్‌లో కేఎల్ రాహుల్ అలా!