ETV Bharat / entertainment

'నా కళ్లెదుట అవి ఉంటే ఆగలేను': ఆలియా భట్ - ఆలియా భట్ సినిమాలు

Alia Bhatt First Audition : బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. అయితే తాజాగా ఆమె తన ఫస్ట్ ఆడిషన్స్​ గురించి గుర్తుచేసుకుంది.

alia bhatt first audition
alia bhatt first audition
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 10:56 PM IST

Alia Bhatt First Audition : బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ కెరీర్​లో మంచి ఫామ్​లో ఉంది. 12 ఏళ్లకే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో తెరంగేట్రం చేసి తక్కువ సమయంలోనే స్టార్ హోదా తెచ్చుకుందీ భామ. స్టార్ కిడ్​గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా, సొంత ప్రతిభతోనే ఎదిగింది ఆలియా. ఇటీవల 2023 నేషనల్ అవార్డ్స్​లో ఉత్తమ నటి అవార్డు దక్కించుకోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అయితే సినిమాల్లోకి వచ్చే ముందు ఫస్ట్ ఆడిషన్​ను ఆలియా తాజాగా గుర్తుచేసుకుంది.

'ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. కరణ్ జోహార్​తో మీటింగ్ ఉన్నట్లు ఆ కాల్​లో చెప్పారు. వెంటనే కాలేజీ యూనిఫామ్​తోనే ఆయన ఆఫీస్​కు వెళ్లా. అప్పుడు నేను కొంచెం బొద్దుగా ఉండేదాన్ని. ఆఫీస్​లో కరణ్ ఆడిషన్ ఇవ్వమన్నారు. నాకు అప్పుడు ఆడిషన్​ అంటే ఏంటో నిజంగా తెలీదు. ఏదో నాకు వచ్చింది చేశా. అంతే యూ ఆర్ సెలెక్టెడ్ అన్నారాయన. అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అదే సమయంలో అక్కడ కేక్​ ఉంది. ఆ ఆనందంలో కేక్ తినొచ్చా? అని అడిగా. కేక్​లు కళ్లెదుట ఆగలేను. నాకు ఫుడ్ అంటే అంత ఇష్టం. ఈ విషయం తెలిసిన మా అమ్మ సినిమాల్లోకి వెళ్తానంటే వెనుకాడింది. కానీ, నాన్న సపోర్ట్​గా నిలిచారు' అని పాత విషయాలు గుర్తుచేసుకుంది.

ఇక ఈ అమ్మడు ఆర్​ఆర్​ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత 'బ్రహ్మాస్త్ర'తో పలకరించింది. ఇక రీసెంట్​గా 'రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' సినిమాతో థియేటర్లలో సందడి చేసింది. ప్రస్తుతం ఆలియా 'జిగ్రా' సినిమా షూటింగ్​లో బిజీగా ఉంది.

Alia- Ranbir Wedding : గతేడాది ఏప్రిల్​లో ఆలీయా, బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్​ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2022 నవంబర్​ 6న రాహా అనే ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం ఆలియా అటు ఫ్యామిలీని చూసుకుంటూనే, ఇటు సినీ కెరీర్​నూ బ్యాలెన్స్​ చేస్తుంది.

వన్​ పీస్​ డ్రెస్​లో ఆలియా క్యూట్​ ఫొటోస్​ - లుక్స్ అదిరిపోయాయిగా!

సో బ్యూటిఫుల్​- సో ఎలిగెంట్​- జస్ట్​ లుకింగ్ లైక్​​ ఏ వావ్​ ఆలియా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.