ETV Bharat / entertainment

'పొరపాటున అలా చేశారా?'.. అలియా భట్​ పోస్ట్​కు సోనూసూద్​ ఫన్నీ రిప్లై

బాలీవుడ్​ హీరోయిన్​ అలియా భట్​ సోషల్​ మీడియా వేదికగా ఓ ఫొటోను షేర్​ చేసింది. దీనికి ప్రముఖ నటుడు సోనూసూద్​ ఫన్నీ రిప్లై ఇచ్చారు. దీంతో ఆ ఫొటో వైరల్​గా మారింది. ఇంతకీ సోనూ సూద్​ ఏమన్నారో తెలుసా..

alia bhat
alia bhat
author img

By

Published : Dec 24, 2022, 6:52 PM IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ పరిచయం అక్కర్లేని పేరు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాల్లో నటించింది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ. తాజాగా ఆలియా భట్‌కు చెందిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రసవానంతరం అలియా యోగా చేస్తున్న ఓ ఫొటోను పోస్ట్​ చేసింది.

alia bhat
అలియా భట్

"ప్రసవానంతరం ఒకటిన్నర నెలల తర్వాత, నా కోర్‌తో నా కనెక్షన్‌ని క్రమంగా పునర్నిర్మించుకుంటున్న. నా యోగా గురువు మార్గదర్శకత్వంలో ఈ తలకిందుల యోగా ఆసనం వేయగలిగాను. నా లాంటి తల్లులకు చెప్పేది ఒక్కటే.. ప్రసవానంతరం మీ శరీరం చెప్పినట్టు వినడం చాలా ముఖ్యం. మీ పొట్ట చెప్పింది ఏమీ చేయవద్దు. నేను వర్కవుట్​ మొదలు పెట్టినప్పుడు.. దాదాపు రెండు వారాల పాటు ఊపిరి పీల్చుకోవడం, నడవడం.. నా స్టబిలిటీని, బ్యాలన్స్​ను మళ్లీ కనుగొన్నాను. అన్ని విధాలుగా ప్రసవం ఒక అద్భుతం. ప్రతి శరీరం భిన్నంగా ఉంటుంది. ఏదైనా వ్యాయామం లాంటిది చేసే ముందు దయచేసి మీ డాక్టర్‌తో మాట్లాడండి" అంటూ పోస్ట్ కింద రాసుకొచ్చింది.

కాగా ఈ పోస్ట్​కి చాలా మంది సెలెబ్రెటీలు రియాక్ట్​ అయ్యారు. అద్భతంగా చేశావని కొనియాడారు. కానీ బాలీవుడ్​ ప్రముఖ నటుడు సోనూసూద్​ చేసి కామెంట్​ నవ్వులు పూయిస్తోంది. ఆలియా తలకిందుల యోగా ఫొటో చూసి ఆశ్చర్యపోయిన సోనూ సూద్​.. ' పొరపాటున ఆ ఫొటోను నువ్వు తలకిందులుగా పోస్ట్​ చేశావ్​ ' అని రాసుకొచ్చారు. దానికి ఓ నవ్వుతున్న ఎమోజి జత చేశారు. దీంతో ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.