ETV Bharat / entertainment

గాయపడినా షూటింగ్​ ఆపని స్టార్​ హీరో.. రూ.15 కోట్లతో యాక్షన్​ సీన్​ - బ్రిటన్​లో హీరో అక్షయ్​ కుమార్ కాలికి గాయం

బాలీవుడ్​ నటుడు అక్షయ్​ కుమార్​కు​ ఓ సినిమా షూటింగ్​లో యాక్షన్ సీన్స్​ తెరకెక్కిస్తుండగా గాయపడ్డారు. అయినా కూడా షూటింగ్​లో అలానే పాల్గొంటున్నారు. ఆ వివరాలు..

akshay kumar shoots action scene in uk knee injury
బ్రిటన్​లో హీరో అక్షయ్​ కుమార్ మోకాలికి గాయం
author img

By

Published : Mar 27, 2023, 4:06 PM IST

Updated : Mar 27, 2023, 4:35 PM IST

బాలీవుడ్​ స్టార్ హీరో అక్షయ్​ కుమార్​ ఓ సినిమా షూటింగ్​లో కొద్ది రోజుల క్రితమే గాయపడ్డారు. అయితే ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే మళ్లీ ఆ సినిమా యాక్షన్​ సీక్వెన్స్​ చిత్రీకరణ కోసం రెడీ అయ్యారు. ప్రస్తుతం అక్షయ్​.. 'బడే మియా ఛోటే మియా' అనే భారీ బడ్జెట్​ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఓ యాక్షన్​ సీన్​ను బ్రిటన్​(యూకే)లో షూటింగ్​ చేసేందుకు ప్లాన్​ చేశారు దర్శకనిర్మాతలు. ఆ సీన్​ను దాదాపు రూ.15 కోట్ల రూపాయలతో షూట్​ చేస్తున్నారట. ఈ యాక్షన్​ సీక్వెన్స్​ను హెలికాప్టర్లు, బైక్​లు, కార్లతో భారీగా రూపొందిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే గతవారం షూటింగ్​లో యాక్షన్ స్టంట్స్​ చేస్తూ మోకాలికి దెబ్బ తగిలి గాయపడ్డారు అక్షయ్​​. అయితే దురదృష్టవశాత్తు ఈ షూట్‌లో హీరోతో పాటు మరికొంత మంది ఆర్టిస్ట్లు కూడా గాయపడ్డారు. అప్పటినుంచి అక్షయ్​ కుమార్​ ఓ కర్ర సాయంతో నడుస్తున్నారని తెలిసింది. అయితే ఇప్పుడీ గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే మరో యాక్షన్​ సీన్​ చేసేందుకు సిద్ధమయ్యారు. భారీ బడ్జెట్​తో ఈ సీక్వెన్స్​ రూపొందుతుండటం వల్ల.. నష్టం రాకూడదు అనే ఉద్దేశంతో అక్షయ్​ షూటింగ్​లో పాల్గొనాలని నిర్ణయంచుకున్నారట. ఇక ఇది తెలుసుకున్న అభిమానులు.. సినిమా పట్ల అక్షయ్​కు ఉన్న నిబద్ధతను చూసి అయన్ను కొనియాడుతున్నారు. అయితే షూటింగ్​ సమయాల్లో నటుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు మేకర్స్​.

కాగా, గతనెల ప్రారంభమైన ఈ షూటింగ్​ సీన్​ వచ్చే నెల ఏప్రిల్ వరకు యూకేలోనే చిత్రీకరించనున్నారు. ఇక ఈ యాక్షన్​ స్టంట్​ను హాలీవుడ్ డైరెక్టర్ క్రెయిగ్ మెక్‌క్రే ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకుడు. టైగర్​ సరసన హీరోయిన్​గా​ జాన్వీ కపూర్​ నటించనున్నారు. అయితే ఈ సినిమాలో టైగర్​ పక్కన నటించే క్యారెక్టర్​లో జాన్వీనే నటించాలని కోరుకున్నారట ష్రాఫ్​. ఆయన కోరిక ప్రకారమే జన్వీని ఫైనల్​ చేశారు మూవీమేకర్స్​. కాకపోతే ఇందులో అక్షయ్‌కుమార్‌కు జోడీగా ఎవరూ లేరు. నటుడు, నిర్మాతగా ఉన్న జాకీ భగ్నానీ తన సొంత బ్యానర్​ అయిన పూజా ఎంటర్​టైన్​మెంట్​ పతాకం​పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్​తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో కొంత షూటింగ్​ను పూర్తి చేసుకున్న ఈ మూవీని స్కాట్​లాండ్​లోనూ చిత్రీకరించారు. ఇక ప్రస్తుతం బ్రిటన్​ దేశంలో ఈ సినిమా షూటింగ్​ కొనసాగుతోంది. ఈ ఏడాదే ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్రబృందం. యాక్షన్‌ చిత్రాల్లో అదరగొట్టే అక్షయ్‌, టైగర్‌లలోని హీరోయిజాన్ని మరింత బాగా తెరపై చూపించే కథ ఇది.. అని అలీ అబ్బాస్‌ సన్నిహితులు చెప్పారు. అలానే ఈ సినిమాలో కామెడీ కూడా బాగా ఉంటుందట.

  • #AkshayKumar𓃵 shoots a bike chase stunt despite having a knee injury🥺 He completed this stunt by having braces on his knee & without any body-double 🥵unlike some fake action gulati master 😂😭#BMCM pic.twitter.com/YjCYfeCavQ

    — S A H I L 🇮🇳 (@BornAkkian) March 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Mar 27, 2023, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.