టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మోస్ట్ వాంటెడ్ హీరోగా ఎదిగారు అడివి శేష్. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినా ఆయనకు మంచి గుర్తింపు లభించలేదు. 2011లో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన 'పంజా' సినిమాలో విలన్‌గా కనిపించి మంచి యాక్టర్‌గా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఆ తరువాత వరుస అవకాశాలు అందుకున్నారు. ఇటీవల ఆయన నటించిన 'హిట్ 2' సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. డిసెంబర్ 17న అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా 'హిట్ 2' మూవీ టీమ్ శేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఆ సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ సీన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'హిట్ 2' సినిమాలో వచ్చే మొదటి సీన్ కూడా ఇదే. ఇందులో అడివిశేష్ వైజాగ్ ఎస్పీ కృష్ణ దేవ్(కె డి)గా కనిపిస్తారు. ఈ ప్రారంభ సీన్లో ఆయన ఓ హత్య కేసును చేధిస్తారు. ఓ వ్యక్తి తన తమ్ముడిని హత్య చేసి ఎవరికీ తెలియకుండా బీచ్‌లో పడేస్తాడు. ఆ విషయం ఎస్పీకి తెలియడంతో క్రైమ్ సీన్‌కు చేరుకుంటారు. ఈ హత్య కేసును కొన్ని క్షణాల్లో చేధించి, హత్య చేసింది అతని అన్నయ్యేనని ప్రూవ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేస్తారు. అయితే తర్వాత మీడియాతో మాట్లాడుతూ జనరల్‌గా ఇలాంటి హంతకులది కోడి బుర్రలు, వీళ్లను పట్టుకోవడానికి 5 నిమిషాలు చాలు అని అంటారు. ఇక్కడ నుంచే సినిమా అసలు కథ మొదలవుతుంది. ఈ సీన్ ప్రేక్షకులను సినిమాలోకి తీసుకువెళ్తుంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో అడివి శేష్‌కు మంచి డిమాండ్ ఉంది. 'బాహుబలి' లాంటి భారీ సినిమాలో నటించిన తర్వాత 2018లో అడవి శేష్ 'గూఢచారి' సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా ఆయన కెరీర్లోనే భారీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇక శేష్ వెనుదిరిగి చూడలేదు. 'అమీ తుమీ', 'గూడాఛారి', 'ఎవరు', 'క్షణం', 'మేజర్', 'హిట్2' సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించి రికార్డు సృష్టించారు. మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగారు. దీంతో అడవి శేష్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అడవి శేష్ సినిమాలో కనిపిస్తే చాలు సినిమా సూపర్ హిట్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయేలా తన మార్కెట్‌ను పెంచుకున్నారు. ఇక 'హిట్ 2'తో స్టార్ హీరోల లిస్ట్‌లో చేరిపోయారు శేష్. మరి ఆయన నుంచి మున్ముందు ఎలాంటి భారీ ప్రాజెక్టులు వస్తాయో చూడాలి.