Adipurush Nepal Ban : ప్రభాస్ రాముడి పాత్రలో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమాపై నేపాల్‌లో వివాదం చెలరేగింది. సీతా మాత నేపాల్‌లో జన్మిస్తే.. 'ఆదిపురుష్' సినిమాలో భారత్‌లో పుట్టినట్టు చూపించారని నేపాల్ నేతలు మండిపడ్డారు. ఈ విషయంపై నేపాల్ రాజధాని కాఠ్‌మండూ మేయర్ బలెన్ షా సైతం స్పందించారు. అలాంటి అభ్యంతరకర సన్నివేశాన్ని మార్చాలని, అందుకు చిత్ర బృందానికి మూడు రోజుల గడువు ఇస్తున్నామని చెప్పారు.
ఒకవేళ ఈ సన్నివేశానన్ని మార్చకపోతే కాఠ్‌మండూ మెట్రోపాలిటిన్ నగరంలో ఏ హిందీ సినిమా ప్రదర్శితమయ్యే అవకాశం ఉండదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా అదే విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు. 'ఆదిపురుష్' చిత్రంతోపాటు భారతీయ సినిమాలన్నింటిపై సోమవారం నుంచి కాఠ్‌మాండూలో నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇదివరకే షెడ్యూల్ అయిన హిందీ/బాలీవుడ్ సినిమాలను థియేటర్ల నుంచి తీసేసి.. వాటి స్థానంలో హాలీవుడ్/నేపాలీ చిత్రాలను ప్రదర్శించాలని ఆదేశించారు.
''సీత జన్మించిన ప్రాంతానికి సంబంధించిన అభ్యంతరకర సందేశాన్ని తొలగించాలని ఆదిపురుష్ చిత్ర యూనిట్‌కు మూడు రోజుల క్రితం విజ్ఞప్తి చేశాం. నేపాల్ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం, ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వయేతర సంస్థలు, నేపాల్ పౌరుల బాధ్యత. కాఠ్‌మండూ మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోని థియేటర్లలో సోమవారం నుంచి ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం"
- — Balen Shah (@ShahBalen) June 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— Balen Shah (@ShahBalen) June 18, 2023
">— Balen Shah (@ShahBalen) June 18, 2023
"పలు అధికరణల ప్రకారం ఫెడరల్, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు.. జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే బాధ్యతను నేపాల్ రాజ్యాంగం కేటాయించింది. ఈ సినిమాను ఎలాంటి మార్పులు లేకుండా ప్రదర్శించినట్లయితే.. నేపాల్ జాతీయ గుర్తింపు, సార్వభౌమాధికారానికి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది'' అని మేయర్ బలెన్ షా తన మాతృభాషలో ట్విట్టర్ పోస్టు పెట్టాడు. అయితే ఈ నిషేధం కాఠ్‌మండూ ప్రాంతానికే పరిమితమవుతుందని స్పష్టం చేశారు.
ఆదిపురుష్ టీమ్ స్పందన..
కాఠ్‌మండూ మేయర్ చేసిన ప్రకటనపై ఆదిపురుష్ టీమ్ స్పందించింది. ఈ మేరకు నేపాలీ మేయర్‌కు టీ-సిరీస్ లేఖ రాసింది. అందులో "ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి ఉద్దేశించినది కాదు. ఆ డైలాగ్.. మహిళలకు గౌరవం తెలపడానికి ఉద్దేశించింది. సినిమాను కళాత్మక రూపంలో వీక్షించాలని.. మన చరిత్రపై ఆసక్తిని కలిగించడానికి ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకునేలా ఈ సినిమాకు సపోర్ట్ చేశాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము" అని లేఖలో పేర్కొంది.
-
Team Adipurush in respect of Public Opinion, Revamps Dialogues for a Unifying Film Experience valuing the input of the public and the audience. The dialogues are being modified in consultation & advice of CBFC@CBFC_India pic.twitter.com/ij8DcmWsZP
— T-Series (@TSeries) June 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Team Adipurush in respect of Public Opinion, Revamps Dialogues for a Unifying Film Experience valuing the input of the public and the audience. The dialogues are being modified in consultation & advice of CBFC@CBFC_India pic.twitter.com/ij8DcmWsZP
— T-Series (@TSeries) June 18, 2023Team Adipurush in respect of Public Opinion, Revamps Dialogues for a Unifying Film Experience valuing the input of the public and the audience. The dialogues are being modified in consultation & advice of CBFC@CBFC_India pic.twitter.com/ij8DcmWsZP
— T-Series (@TSeries) June 18, 2023
Adipurush Movie Collection : ఇక 'ఆదిపురుష్' విషయానికొస్తే.. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించారు. కృతిసనన్ సీత పాత్ర పోషించారు. ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటివరకు రూ. 240 కోట్ల కెలక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది.
-
Adipurush continues to mesmerise audiences worldwide, surpassing expectations with a bumper opening of ₹140 CR on Day 1, it adds ₹100 CR on Day 2, taking the total collection to a phenomenal ₹240 CR in just two days! Jai Shri Ram 🙏https://t.co/0gHImE23yj#Prabhas @omraut… pic.twitter.com/EOCb2GroSQ
— T-Series (@TSeries) June 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Adipurush continues to mesmerise audiences worldwide, surpassing expectations with a bumper opening of ₹140 CR on Day 1, it adds ₹100 CR on Day 2, taking the total collection to a phenomenal ₹240 CR in just two days! Jai Shri Ram 🙏https://t.co/0gHImE23yj#Prabhas @omraut… pic.twitter.com/EOCb2GroSQ
— T-Series (@TSeries) June 18, 2023Adipurush continues to mesmerise audiences worldwide, surpassing expectations with a bumper opening of ₹140 CR on Day 1, it adds ₹100 CR on Day 2, taking the total collection to a phenomenal ₹240 CR in just two days! Jai Shri Ram 🙏https://t.co/0gHImE23yj#Prabhas @omraut… pic.twitter.com/EOCb2GroSQ
— T-Series (@TSeries) June 18, 2023