ETV Bharat / entertainment

'ప్రేమలో నమ్మకం ఉంది.. కష్టాన్ని గౌరవంతో'.. సామ్​ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​! - సమంత వెబ్​సిరీస్​

హీరోయిన్​ సమంత.. శాకుంతలం చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన ఓ స్పెషల్ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అందులో శకుంతల పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సామ్. అవేంటో తెలుసుకుందాం.

actress samantha about her character in shakunthalam movie

author img

By

Published : Mar 23, 2023, 9:27 AM IST

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ సమంత.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే యశోద సినిమతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్​.. త్వరలోనే శాకుంతలం చిత్రంతో పలకరించనుంది. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. చిత్రయూనిట్​.. ఓ షెడ్యూల్​ ప్రకారం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. సమంత ముంబయిలో సందడి చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసిన ఓ వీడియో.. ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అందులో శాకుంతలం చిత్రంలోని తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది సామ్.

"శకుంతల. ఆమెకు చాలా నమ్మకాలు ఉన్నాయి.. తన ప్రేమలో.. తన భక్తిలో ఎప్పుడూ నిజాయితీగానే ఉంటుంది. తన జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ఆమె దయ.. గౌరవంతో భరించింది. తనను బాధించిన అనేక సంఘటనలను నమ్మకంతో ఎదుర్కొంది. ఆమె యువరాణి. అడవి.. జంతువుల పాత్రలు నాలోని చిన్నపిల్లను గుర్తుచేశాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో శకుంతల పాత్ర పోషించినందుకు. ఈ సినిమాను ప్రేక్షకులు చూసి ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది" అంటూ చెప్పుకొచ్చింది సామ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. శాకుంతలం సినిమా కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో గౌతమి, ప్రకాశ్​ రాజ్, మోహన్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళీ నటుడు దేవ్ మోహన్ హీరోగా కనిపించనున్నారు. తెలుగుతోపాటు.. తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో అదితి బాలన్.. అల్లు అర్హ, వర్ణిణి, కబిర్ సింగ్ దుహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పౌరాణిక ప్రేమగాథలో ఒరిజినాలిటీ ఉండేందుకు ఒరిజినల్ నగలనే వాడారట చిత్రయూనిట్.

మయోసైటిస్‌ వ్యాధి బారిన పడి, కోలుకుంటున్న సమంత కొన్నాళ్ల విరామం అనంతరం చిత్రీకరణలతో మళ్లీ బిజీ అయింది. సిటాడెల్‌ వెబ్‌సిరీస్‌ కోసం రంగంలోకి దిగింది. వెబ్​సిరీస్​లో ఆమె పాత్రలో ఒదిగిపోయేందుకు తగిన శిక్షణ తీసుకుంటోంది. సమంత ఇటీవల నటించిన యశోద చిత్రానికి యానిక్‌ పనిచేశారు. సిటాడెల్‌ కోసం ఇప్పుడు మరోసారి కలిశారు. వరుణ్‌ ధావన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సిరీస్‌ ఇది. రాజ్‌- డీకే దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు, ఖుషి సినిమా చిత్రీకరణలో సమంత ఈ నెలలో పాల్గొంటారని సమాచారం. విజయ్‌ దేవరకొండ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రమిది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.