ETV Bharat / entertainment

హీరో ఉపేంద్రపై నటి ప్రేమ సంచలన కామెంట్స్​.. ఫ్యాన్స్​ మండిపాటు! - ఉపేంద్రపై కీలక వ్యాఖ్యలు చేసిన నటి ప్రేమ

నటుడు ఉప్రేంద్రపై కామెంట్స్​ చేసింది సీనియర్​ నటి ప్రేమ. ఓ సందర్భంలో ఉపేంద్ర తనతో ప్రవర్తించిన తీరు అస్సలు నచ్చలేదని చెప్పింది. ఇంతకీ ఉపేంద్ర ఏం చేశారంటే..

నటి ప్రేమ ఉపేంద్రపై కీలక వ్యాఖ్య
actress-prema-comments-on-hero-upendra
author img

By

Published : Oct 29, 2022, 5:52 PM IST

Updated : Oct 29, 2022, 6:50 PM IST

భక్తిపరమైన పాత్రలతో పాటు , గ్లామర్‌ పాత్రల్లో హీరోయిన్‌గానే గాక సపోర్టింగ్‌ రోల్స్‌లోనూ ఆదరగొట్టిన ఎవర్‌గ్రీన్‌ చార్మింగ్‌ క్వీన్‌ ప్రేమ. 'ఓం' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత తెలుగులో 'ధర్మచక్రం'తో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కోరుకున్న ప్రియుడు, మా ఆవిడ కలెక్టర్‌, దేవి, దీర్ఘసుమంగళిభవ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె తాజాగా 'అనుకోని ప్రయాణం' చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

ఈ చిత్రం ప్రమోషన్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె నటుడు ఉప్రేంద్ర పై కీలక వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు వస్తున్నాయి. వాటి ప్రకారం ఆమె.. ఆయనతో జరిగిన ఓ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 'సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతో ఇష్టం.. అందుకే స్ట్పోర్స్ వదిలి సినీ ఇండస్ట్రీవైపు వచ్చాను. ఉపేంద్ర హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఓం' చిత్రంలో నటించినందుకు ఎంతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత నాకు వరుస ఛాన్సులు వచ్చాయి. షూటింగ్ సమయంలో ఉపేంద్ర ప్రవర్తించే తీరు నన్ను చాలా బాధపెట్టింది.. ఒకసారి కలర్స్ తీసుకొని ముఖంపై చల్లారు.. అది నా కళ్లలో పడి చాలా సేపే నరకం అనుభవించాను, ఆయనకు అసలు మానవత్వం లేదు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

నటి ప్రేమ చేసి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఉపేంద్ర అభిమానులు నటి ప్రేమపై ఘాటుగా స్పందించారు. ఈ విషయంపై హీరో ఉపేంద్ర స్పందించారు. తన సినిమా పర్ఫెక్ట్​గా రావడం కోసమే తాను అలా ప్రవర్తించి ఉంటానని చెప్పారు. ఆడవాళ్లు అంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి వెళ్లనున్న జూనియర్ ఎన్టీఆర్

'పాన్ వరల్డ్ నాయికగా ఎదగాలనుకుంటున్నా'

Last Updated : Oct 29, 2022, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.