ETV Bharat / entertainment

నేచురల్​ స్టార్​ను కలిసిన మృణాల్ ఠాకూర్... ఏంటి మేటర్? - మృణాల్​ ఠాకుర్ అప్​కమింగ్​ మూవీస్​

జెర్సీ సినిమా తెలుగు నాట బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఈ సినిమాను హిందీలో సైతం రీమేక్​ చేశారు. తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్​ నటించిన ఆ పాత్రను హిందీలో మృణాల్​ పోషించింది. తాజాగా ఈ సీతారామం స్టార్​ నేచురల్​ స్టార్​తో మీట్​ అయ్యిందట.

mrunal meets natural star
mrunal thakur meets nani
author img

By

Published : Oct 11, 2022, 4:58 PM IST

మృణాల్​ ఠాకుర్​.. ఈ పేరు పెద్దగా తెలియకపోయినప్పటికీ.. 'సీతారామం'లో సీతా అంటే అందరూ ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఆ క్యారెక్టర్​కున్న క్రేజ్ అలాంటిది మరి. ఈమె హిందీ ఆడియన్స్​కు సుపరిచితమైనప్పటికీ మన దక్షిణాదిన సీతా రామంతోనే పరిచయమయ్యింది. అందమైన కళ్లతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన మన సీతామహాలక్ష్మీ తెలగునాట తన మొదటి సినిమాతో బ్లాక్​బస్టర్​ కొట్టడమే కాకుండా పలువురి ప్రముఖుల నుంచి ప్రసంశలు అందుకుంది.

ఈ సినిమాతో సౌత్​లో మృణాల్ ఫేమ్​ ఒక్కసారిగా మారిపోయింది. తన కాల్షీట్స్​ మొత్తం వరుస సినిమాలతో నిండపోయాయి. కానీ ఈ అమ్మడి నుంచి ఎటువంటి తాజా అప్డేట్స్​ రాలేదు. అయినప్పటికి సామాజిక మాధ్యమాల్లో ఏదో ఒక రూమర్స్​ అప్డేట్​లోనే ఉంది. తాజాగా మృణాల్​ నేచురల్​ స్టార్​ నానిని కలిసింది.

వీరిద్దరు కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 'వీరిద్దరి కాంబోలో ఏదైనా మూవీ రాబోతుందా?' అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదివరకే హను రాఘవపూడి దర్శకత్వంలో నాని నటించిన విషయం తెలిసిందే. సీతారామం జోడితో మరో మూవీ రాబోతుందంటూ నిర్మాత అశ్వనీదత్ అనౌన్స్ చేయగా, తారక్​,కొరటాల శివ కాంబోలో రాబోతున్న మూవీలోనూ మృణాల్ ఎంపికైనట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇదీ చదవండి: 'నువ్వే నువ్వే'కు 20 ఏళ్లు.. హైదరాబాద్​లో చిత్ర యూనిట్ సందడి

అలాంటి పోజులైనా ఇచ్చేందుకు సిద్ధమేనంటున్న రష్మిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.