ETV Bharat / entertainment

విజయ్​ సేతుపతి న్యూ లుక్​.. అవాక్కవుతున్న ఫ్యాన్స్‌

author img

By

Published : Dec 14, 2022, 1:49 PM IST

బాడీ షేమింగ్​ ట్రోల్స్​కు గురైన విలక్షన నటుడు విజయ్​ సేతుపతి తన కొత్త లుక్​తో ఫ్యాన్స్​, ట్రోలర్స్​కు షాకిచ్చారు. ఆయన కొత్త లుక్​ అదిరిపోయింది.

Vijay sethupati new look viral
విజయ్​ సేతుపతి న్యూ లుక్​.. అవాక్కవుతున్న ఫ్యాన్స్‌

పాత్ర ఏదైనా సరే.. దానిలో పరకాయ ప్రవేశం చేసి.. ఆయా పాత్రలకు జీవం పోస్తారు కొంతమంది నటులు. ఈ కేటగిరిలో ముందు వరుసలో ఉంటాడు విజయ్‌ సేతుపతి. పాత్ర నచ్చితే చాలు.. దాని కోసం ఏం చేయడానికి అయినా సిద్ధపడతాడు. అలా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు. అయితే విలక్షణ నటుడిగా ఎంతటి క్రేజ్‌.. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడో.. ఈ మధ్య కాలంలో అంతకన్నా ఎక్కువగా ట్రోలింగ్‌ బారిన పడ్డారు. అందుకు కారణం అధిక బరువు. దీంతో బాడీ షేమింగ్​ ట్రోల్స్​కు గురయ్యాడు. నెటిజన్లు ఆయన లుక్‌పై తెగ విమర్శలు చేశారు. సినిమాలు సరే.. కాస్త నీ బాడీ, లుక్‌పై దృష్టి పెట్టు అంటూ కామెంట్స్‌ చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా విజయ్‌ సేతుపతి నయా లుక్‌ చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. స్లిమ్‌, అండ్‌ హ్యాండ్‌సమ్‌ లుక్‌లో కనిపించి.. ట్రోలర్స్‌కు, ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రస్తుతం ఈ న్యూలుక్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారింది. ఎంతలో ఎంత మార్పు.. లుక్‌ సూపర్బ్‌గా ఉంది బ్రో.. ఇదే కంటిన్యూ చేయ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌. కాగా, సూపర్‌ డీలక్స్‌, ఉప్పెన, విక్రమ్‌, 96 సహా పలు చిత్రాలతో పాన్​ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న విజయ్​ ప్రస్తుతం మైఖేల్​, మెరీ క్రిస్మస్​, విదుథలయ్​, గాంధీ టాక్స్​, ముంబైకర్​, జవాన్​ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: ఏంటి పవన్​ కల్యాణ్​​ మార్షల్​ పోజు మంచు లక్ష్మీదా.. వైరల్​గా మారిన పోస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.