బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్‌కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండే ఆయన.. స్టోరీలో ఏదో ఒక ఇన్‌స్పైరింగ్ ఎలిమెంట్ ఉంటే తప్ప ఆ చిత్రంలో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. పైగా ఆయా పాత్రలకు తగ్గట్టుగా తనను తాను మలుచుకోవడంలో ఎంతో కష్టపడతారు. అందుకే ఫ్యాన్స్ ముద్దుగా మిస్టర్ పర్ఫెక్ట్గా పిలుచుకుంటారు.
అయితే, కొంతకాలం క్రితం ఆమీర్ తమ భార్య కిరణ్‌రావుతో పరస్పర అంగీకారంతో విడిపోయారు. అయితే ఈ జంట రీసెంట్‌గా కలిసి తమ ప్రొడక్షన్ హౌస్‌లో కలశ పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ఆఫీస్ సిబ్బందితో పాటు లాల్ సింగ్ చద్దా డైరెక్టర్ అద్వైత్ చందన్ హాజరయ్యారు. పైగా ఈ ఫొటోలను ఆయనే ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ వేడుకలో ఆమీర్ తలకు నెహ్రూ క్యాప్‌తో భుజలపై కండువా ధరించారు. ఓ అభిమాని ఈ ఫొటోలపై స్పందిస్తూ.... నిజంగా ఆమీర్ ఖాన్‌ను ఇలా చూసి ఆశ్చర్యపోయాను. ఇవి హార్ట్ టచింగ్ మూమెంట్స్ అని కామెంట్ చేశాడు. మరొక అభిమాని.. ఆమీర్, కిరణ్ రావు జంటగా చాలా అందంగా ఉన్నారని, వారిద్దరినీ ఎప్పుడూ ప్రేమిస్తానని పేర్కొన్నాడు.
![Aamir Khan performing pooja at new office with Ex Wife Kiran Rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17156386_1.jpg)
![Aamir Khan performing pooja at new office with Ex Wife Kiran Rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17156386_3.jpg)
కాగా, ఆమీర్ ఖాన్, కిరణ్ రావు తమ 15 ఏళ్ల సుదీర్ఘ వివాహ బంధానికి గతేడాది ముగింపు పలికారు. అయినప్పటికీ తమ కుమారుడు ఆజాద్ రావ్ ఖాన్‌కు కోపేరెంట్స్‌గా కొనసాగుతున్నారు. ఇక ఆమీర్ రీసెంట్‌గా 'లాల్ సింగ్ చద్దా' మిక్స్‌డ్ రివ్యూస్‌తో బాక్సాఫీస్ వద్ద హిట్‌ను అందుకోలేకపోయాడు. దీంతో ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఆయన.. ఒక ఏడాది తర్వాత తిరిగి కెరీర్‌పై ఫోకస్ చేస్తానని ఇటీవలే చెప్పారు.
![Aamir Khan performing pooja at new office with Ex Wife Kiran Rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17156386_2.jpg)
ఇదీ చూడండి: దీపిక గోల్డెన్ బికినీ ట్రీట్ ఇదంతా షారుక్ కోసమేనా