ETV Bharat / entertainment

OTTలో అదరగొడుతున్న 90s మిడిల్ క్లాస్- 120000000 మినిట్ వ్యూస్‌తో టాప్ రేటింగ్‌లో - 90s మిడిల్ క్లాస్ బయోపిక్​

90s Middle Class Biopic OTT : సినిమాలకు బ్రేక్ ఇచ్చి బిగ్ బాస్ 7తో మళ్లీ వెలుగులోకి వచ్చిన హీరో శివాజీ - రీసెంట్​గా నటించిన వెబ్ సిరీస్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ సిరీస్​కు ఓటీటీలో క్రేజ్ తగ్గట్లేదు. అంతే కాదు ఐఎండీబీలోనూ మంచి రేటింగ్ సాధించుకుంది. ఆ వివరాలు.

OTTలో అదరగొడుతున్న 90s మిడిల్ క్లాస్ - 120000000 వ్యూస్‌తో టాప్ రేటింగ్‌లో

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 5:10 PM IST

Updated : Jan 13, 2024, 6:36 PM IST

90s Middle Class Biopic OTT : ఓటీటీలో సినిమాలకు, వెబ్​సిరీస్​లకు విపరీతమైన ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు థియేటర్స్​లో సినిమాలు చూస్తూనే మరోవైపు ఓటీటీలోనూ సినిమాలను, సిరీస్​లను బాగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఆడియెన్స్​ కోసం ఓటీటీ సంస్థలు ఎన్నో కొత్త కంటెంట్​ను తీసుకువస్తున్నాయి. వారి అభిరుచికి తగ్గట్లుగా కామెడీ, థ్రిల్లర్, ఎమోషనల్ సిరీసులు, సినిమాలు రిలీజ్ చేస్తున్నాయి. అయితే రీసెంట్​గా బిగ్​బాస్​తో మళ్లీ వెలుగులోకి వచ్చిన హీరో శివాజీ(shivaji 90s web series ott platform) ఇటీవల ఓ కామెడీ ఎమోషనల్ డ్రామా సిరీస్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

హ్యాష్ ట్యాగ్ 90S ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్​లో నటించారు. ఈటీవీ విన్​లో ఈ సిరీస్ రిలీజ్ అయిన తొలి రోజు నుంచే విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఓటీటీలో పుల్​ ట్రెండింగ్​లో ఉంటోంది. ఈ సిరీస్​లో అప్పటి జనరేషన్ పిల్లలు, తల్లి తండ్రులు, అప్పటి పరిస్థితులను చాలా చక్కగా చూపించారు దర్శకుడు. చక్కటి ఎమోషన్స్, మ్యూజిక్, ఆకట్టుకునే సంభాషణలతో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ చూసే విధంగా దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ ఓ అరుదైన రికార్డ్​ను అందుకుంది. 120+ మిలియన్ మినిట్స్ వ్యూస్ సొంతం చేసుకుని సూపర్ రెస్పాన్స్​తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా ఈటీవీ విన్​ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

అంతే కాదు ఈ సిరిస్ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్​లో(IMDB) 9.6 రేటింగ్ సొంతం చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది. విశేష ఆదరణ పొందిన సిరీసుల్లో ఒకటిగా నిలిచింది. ఈ సిరీస్​ను ఆదిత్య హాసన్ తెరకెక్కించారు. శివాజీ, మౌళి, వసంతిక, రోహన్ రాయ్, వాసుకీ ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం సంయుక్తంగా నిర్మించారు. ఒకవేళ మీరు ఈ సిరీస్​ను ఇంకా చూడకపోయి ఉంటే మిస్​ కాకుండా ఈటీవీ విన్​లో చూసి ఎంజాయ్ చేయండి.

ఈటీవీ విన్​లో శివాజీ సిరీస్ - '#90s బయోపిక్ ' ఎలా ఉందంటే ?

'గుంటూరు కారం' మిక్స్డ్​ రివ్యూ - రియాక్ట్ అయిన దిల్​ రాజు, నాగవంశీ

Last Updated : Jan 13, 2024, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.