2024 Sankranthi Movies : సంక్రాంతి బరిలోకి దిగి తమ సత్తా చాటేందుకు ఎంతో మంది స్టార్స్ ఎదురు చూస్తుంటారు. 'మా లక్ష్యం సంక్రాంతి' అంటూ పలువురు మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించి ధీమాగా ఉంటారు. తీరా చూస్తే.. ఆ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో కొత్త సినిమాలు రావడం.. ఇదంతా తెలుగు ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో రానున్న ఏడాది విషయంలోనూ అదే జరగనుందా? ఈ రేసులో లేని సినిమాలూ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయా? అసలు 2024 సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఏవంటే?
అగ్ర తారల సినిమాలు ఎప్పుడొచ్చినా తిరుగు ఉండదు. ముఖ్యంగా పండగ సీజన్లో వస్తే మాత్రం ఆ సినిమాలకు వచ్చే డిమాండ్ వేరు. అందుకే అడ్వాన్స్ బుక్కింగ్స్ లాగా ముందుగానే పండగల తేదీల్ని రిజర్వ్ చేసుకుని పలు సినిమాలు రెడీ అవుతుంటాయి. ఇక ఆడియెన్స్ ఆయా సినిమాలను చూసేందుకు ఎదురు చూసే సమయం ఇదే అంటూ... చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమా వరకు ఫెస్టివల్ ఆఫర్లా థియేటర్లలో సందడి చేస్తుంటాయి. అలా ఈ ఏడాది కొన్ని అగ్ర తారల సినిమాలు... మరికొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు మన ముందుకు రానున్నాయి. సెప్టెంబర్‌లో రానున్న వినాయక చవితి నుంచి... డిసెంబర్లో వచ్చే క్రిస్మస్ పండుగ వరకూ సినిమా క్యాలెండర్ మొత్తం రిలీజ్ డేట్స్‌తో నిండిపోయింది.
Salaar Movie Release Date : ఇక టాప్ హీరోల సినిమాల విడుదల తేదీ కాస్త అటూ ఇటైతే ... ఆ ప్రభావం మిగతా అన్ని సినిమాలపైనా పడుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న 'సలార్' సినిమా సెప్టెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఈ రిలీజ్‌ను వాయిదా వేశారు మేకర్స్. దీంతో ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. అయితే రానున్న పండగలన్నీ మిగతా సినిమాలతో భర్తీ అయ్యాయి. ఒకవేళ పండగ రోజులనే టార్గెట్ చేసుకుని 'సలార్' రంగంలోకి దిగితే.. మిగిలిన సినిమాల విడుదల తేదీలను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.
Guntur Kaaram Movie Release Date : మరోవైపు రానున్న సంక్రాంతికి సందడి చేసేందుకు అరడజను సినిమాలు సన్నాహాలు చేస్తున్నాయి. అందులో మహేశ్ బాబు 'గుంటూరు కారం', రవితేజ 'ఈగల్', నాగార్జున 'నా సామిరంగ', తేజ సజ్జా 'హను-మాన్'తోపాటు విజయ్ దేవరకొండ - పరశురామ్ సినిమాలు ఉన్నాయి. ఈ మూవీస్ అన్నీ సంక్రాంతికి విడుదల అంటూ ఇప్పటికే తేదీ ఖరారు చేశాయి. ఇక ప్రభాస్ 'కల్కి' సినిమా కూడా సంక్రాంతినే లక్ష్యంగా చేసుకుని ముస్తాబవుతోంది. వీటిలో ఒకటి రెండు సినిమాలు తప్ప అన్నీ కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. అయితే పండగకి ఇంకా నాలుగు నెలలు మాత్రమే టైమ్ ఉంది. మరి ఆలోపు పనులన్నీ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధమయ్యే సినిమాలు ఎన్ని అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెద్ద పండగే అయినప్పటికీ సంక్రాంతికి నాలుగు సినిమాల కంటే ఎక్కువ విడుదలయ్యే పరిస్థితి ఉండదు. సరిగ్గా అదే సమయానికి పొరుగు భాషల నుంచీ కొన్ని అగ్ర తారల సినిమాలు బాక్సాఫీసు ముందుకు దూసుకొస్తుంటాయి. ఈ పరిణామాలన్నిటి మధ్య చివరికి తెరపైకొచ్చే సినిమాలేవన్నది కాలమే నిర్ణయించాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అప్పుడే 2024 సంక్రాంతి సినిమాలపై ఉత్కంఠ!
నెం.1గా అల వైకుంఠపురములో.. సంక్రాంతి టాప్-5 హైయెస్ట్ కలెక్షన్ మూవీస్ ఇవే