స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా... రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగం మాత్రం పూర్తి స్ధాయిలో జరగట్లేదు. ఇప్పటికీ చాలా చోట్ల 50 నుంచి 60 శాతం ఓట్లు మాత్రమే పోలవుతున్నాయ్. గ్రామీణులతో పోలిస్తే... పట్టణ ఓటర్లలో చైతన్యం చాలా తక్కువే. ఎంత అవగాహన కల్పించినా... పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసేవారు 60శాతానికి మించడం గగనమవుతోంది. చదువు సంధ్యా లేని గిరిపుత్రులు మాత్రం బాధ్యతగా భావించి విధిగా ఓటేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎండాకాలం బిందెడు నీటి కోసం మైళ్ల దూరం నడిచే వీరు ఓటింగ్ కేంద్రాల్లో బారులు తీరుతున్నారు. గతంతో పోలిస్తే... ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లిలో పోలింగ్ సాయంత్రం 4గంటలకే అయినా... సాయంత్రం 6దాకా కొనసాగుతుంది.
జిల్లా | మండలం | గ్రామం | శాతం |
మహబూబాబాద్ | గంగారం | కొడిశలమిట్ట | 98.70 |
కొత్తగూడ | కర్నగండి | 94.50 | |
జయశంకర్ భూపాలపల్లి | మహదేవ్ పూర్ | పెద్దంపేట | 98.20 |
పలిమెల | ముకునూరు | 95.22 | |
మహాముత్తారం | బోర్లగూడెం | 92.13 | |
ములుగు | ఏటూరునాగారం | రామన్నగూడెం | 92.34 |
గోవిందరావుపేట | ముత్తాపూర్ | 94.52 | |
వెంకటాపురం | కేకొండాపురం | 94.70 | |
కన్నాయ్ గూడెం | చింతగూడెం | 93.88 |
ఇవీ చూడండి: నేనూ కొత్తేమీ కాదు... ఎప్పటి నుంచో ప్రజాసేవలో ఉన్నా