ETV Bharat / elections

భారత్​ భేరి: పటేళ్ల కోటలో కమలం వికసించేనా? - congress

గుజరాత్​లో పాటీదార్ల రిజర్వేషన్​ ఉద్యమం 2017లో ఉవ్వెత్తున ఎగిసింది. ఆ ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపాకు ముచ్చెమటలు పట్టించింది.​ మోదీపై సానుకూలత కారణంగా 99 సీట్లతో గట్టెక్కింది భాజపా. పాటీదార్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సౌరాష్ట్రలో మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరి ఈసారి లోక్​సభ ఎన్నికల్లో పాటీదార్లు ఎవరి పక్షం?

భారత్​ భేరి: పటేళ్ల కోటలో కమలం వికసించేనా?
author img

By

Published : Apr 21, 2019, 6:22 AM IST

భారత్​ భేరి: పటేళ్ల కోటలో కమలం వికసించేనా?

గుజరాత్​లో పాటీదార్లు బలమైన వర్గంగా ఉన్నారు. మొదటి నుంచి వారి మద్దతు భాజపాకే. 2017లో పరిస్థితి మారింది. రిజర్వేషన్ల కోసం పాటీదార్లు ఉద్యమబాట పట్టారు. హార్దిక్​ పటేల్​ నేతృత్వంలో ఆందోళనలు చేశారు. ఆ ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ఉద్యమ ప్రభావం కనిపించింది.

శానసనభలో అలా.. మరి ఇప్పుడు

పాటీదార్ల ఉద్యమ ప్రభావం ఉన్నా.. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గట్టెక్కింది భాజపా. అయితే ఆ వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న సౌరాష్ట్రలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సౌరాష్ట్రలోని 7 లోక్​సభ నియోజకవర్గాల పరిధిలోని 49 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 30 గెలుపొందింది. భాజపా కేవలం 18 గెలిచింది. ఎన్సీపీ ఒక స్థానం కైవసం చేసుకుంది.

పాటీదార్ల ఉద్యమనేత హార్దిక్​ పటేల్ ఇప్పుడు​ కాంగ్రెస్​లో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇదే భాజపా నేతల గుండెల్లో గుబులు రేపుతోంది.

"ఉద్యమం పాత మాట"

పాటీదార్ల రిజర్వేషన్ల ఉద్యమం ఇప్పుడు అసలు ఎన్నికల అంశమే కాదంటోంది భాజపా. అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్​ కల్పించిన తమకే.. పటేళ్ల మద్దతు ఉంటుందన్నది కమలదళం వాదన.

రైతులే లక్ష్యం...

గుజరాత్​లోని సౌరాష్ట్ర ప్రాంతంలో చాలామంది పాటీదార్లు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. కర్షకులకు ఏటా రూ.6 వేలు సాయం నగదు బదిలీ ద్వారా అందించే ప్రధాన మంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి కార్యక్రమం తమకు లాభిస్తుందని భాజపా నేతలు లెక్కలేసుకుంటున్నారు.

రైతులకిచ్చిన హామీల అమలులో భాజపా ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ కాంగ్రెస్​ ప్రచారం సాగిస్తోంది.

"భాజపా ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగా లేరు. తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వర్షాభావంతో రైతులు ఇబ్బందులు పడితే ప్రభుత్వం సాయం అందించలేదు."
-అర్జున్ సోసా, కాంగ్రెస్ అమ్రేలీ జిల్లా అధ్యక్షుడు

"పంటల బీమా పథకం సరిగ్గా అమలు కావట్లేదు. బీమా ప్రీమియం చెల్లించినా గ్రామాల్లో రైతులకు క్లెయిమ్​ సొమ్ము అందట్లేదు. కరవు ప్రాంతాల్లో మాత్రం రూ.11,600 సాయం అందించారు."
-భరత్ పడ్సాలా, కేరళ గ్రామ రైతు, అమ్రేలీ జిల్లా

భాజపా ప్రభుత్వం సౌరాష్ట్రలో రూ.4000 కోట్లు విలువైన పల్లీ కుంభకోణానికి పాల్పడిందన్న ఆరోపణలను ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తోంది కాంగ్రెస్.

యువతపైనే భాజపా ఆశలు...

2014లో గుజరాత్​లోని 26 లోక్​సభ సీట్లను క్లీన్​స్వీప్​ చేసింది భాజపా. ఇప్పుడు యువత మద్దతుతో ఆ సీట్లు నిలబెట్టుకోగలమని భావిస్తోంది కమలదళం.

"గత అసెంబ్లీ ఎన్నికల్లో... యువత మాకు వ్యతిరేకంగా ఉన్నందున మేం ఇబ్బందిపడ్డాం. అసెంబ్లీలో మా సీట్లు తగ్గాయి. ఇప్పుడు యువత మా వైపున్నారు. మోదీకి మద్దతిస్తున్నారు. జాతీయవాదం వైపు నిలుస్తున్నారు. గుజరాత్​లో ఒక్క లోక్​సభ సీటు కూడా కోల్పోం. కొంతకాలమే కులాన్ని తప్పుదోవ పట్టించగలం. ఎప్పటికీ అది సాధ్యంకాదు. పాటీదార్ల ఆందోళన ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రేరేపించిన ఉద్యమం."
-మన్సుఖ్ మండావియా, కేంద్ర మంత్రి

ఫిరాయింపులు...

సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కొందరు జిల్లా స్థాయి నేతలు ఇటీవలే భాజపాలో చేరారు. ఇవన్నీ మరోమారు క్లీన్​ స్వీప్​ చేసేందుకు ఉపకరిస్తాయని కమలదళం ఆశిస్తోంది.

గుజరాత్​లోని 26 లోక్​సభ నియోజకవర్గాలకు ఈనెల 23న పోలింగ్​. మే 23న ఫలితం.

ఇదీ చూడండి: హ్యాష్​ట్యాగ్​ల యుద్ధంలో విజేత ఎవరో..?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rio de Janeiro - 19 April 2019
1. Various of actors getting ready to perform Passion of the Christ production in Rocinha neighbourhood
2. Jefferson Messias, who plays the role of Jesus getting dressed
3. SOUNDBITE (Portuguese) Jefferson Messias, 21-year-old performer and resident of Rocinha:
"I feel thrown, I feel abandoned. As I said, in a moment like this one that we are living, if they (government) don't look at education, if they don't look at health(care), what can we expect for culture? The Passion of the Christ (theater group) of Rocinha is about resistance, we put this performance in the street with what we can to say: we can't stop the Passion of the Christ."
++NIGHT SHOTS++
4. Various of performance
5. Wide of hundreds of people attending performance
6. SOUNDBITE (Portuguese) Robson Mello, director of the performance:
"On this 27th anniversary (of the performance) we got completely nothing (from the authorities). Actually Rio's City Hall still owes (money) to the sound, stage and structure companies that worked last year."
7. Various of performance and hundreds attending
8. Marinete de Cunha (black top) and her family watching performance
9. SOUNDBITE (Portuguese) Marinete de Cunha, resident of Rocinha:
"I think it's important to keep this tradition, it's a way to educate the children. And with all things that have been happening in our Rocinha (violence, floods, and suffering of the residents), this helps."
10. Actor playing the roll of Pontius Pilate, washing his hands during Jesus' condemnation
11. Various of actors reenacting crucifixion of Jesus
12. Close of woman taking picture of performance with cellphone
13. Actors taking a bow and audience clapping at end of performance
STORYLINE:
Residents of Rocinha, one of Rio de Janeiro's biggest favelas, have re-enacted the Passion of the Christ as part of their annual Good Friday celebrations.
Hundreds of locals lined the streets to watch as the Passion play, or Via Sacra, was staged for the 27th year in a row.
The actors presented a theatric recreation of the 12 Stations of the Cross that reflected the scenery as well as realities around them.
They say the themes of violence, persecution and injustice strongly resonate with residents of the neighbourhood.
The local theatre group behind the play has been operating in Rocinha since 1992 and was set up to increase social awareness.
The group used to have about 60 participants, but this year only 35 took part, all of them volunteers and locals.
The annual performance draws large crowds and is considered part of Rio's cultural heritage.
But the theatre group struggles to survive, with organisers saying it has not received any support from Rio's City Hall, which failed to follow through on a promise to pay for lighting and sound.
This year's performance was made possible by the support of Rocinha residents and a sound and lighting company that donated a microphone and two speakers.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.