ఈ నెల 12న సాయంత్రం గాంధీనగర్‌కు చెందిన మహిళ, ఆమె తల్లితో కలిసి మెదక్ జిల్లాలోని ఏడుపాయల నాగసాన్‌పల్లిలోని వనదుర్గ భవానీ దేవి ఆలయానికి వెళ్లింది. అక్కడ దర్శనం అనంతరం జోగిని శ్యామలను కలిశామని మహిళ పేర్కొంది. శ్యామల ఆమెకు చెందిన ఓ గదిలో ఆశ్రయం కల్పించిందని తెలిపింది.
అప్పటికే ఆ గదిలో మరో 15మంది పురుషులున్నారని... వారితో కలిసి శ్యామల తనను మద్యం సేవించాలని బలవంతం చేశారని మహిళ ఆరోపించింది. అనంతరం వివస్త్రను చేసి చిత్రహింసలకు గురిచేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పాపన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగినందున పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను ఆ ఠాణాకు బదిలీ చేశారు.
ఇదీ చూడండి: మహేశ్ బ్యాంక్ ఛైర్మన్‌తో పాటు మరో ఇద్దరిపై చీటింగ్ కేసు