ETV Bharat / crime

లోన్​యాప్ వేధింపులు.. రాజస్థాన్​కు చెందిన నిందితుడు అరెస్టు - రాజస్థాన్​కు చెందిన లోన్​ యాప్​ముఠా సభ్యుడుఅరెస్ట్

Lone App gang member arrest: లోన్​ యాప్​ వేధింపులపై పోలీసులు దృష్టిసారిస్తున్నారు. తాజాగా లోన్​యాప్​ ముఠాకు సంబంధించి రాజస్థాన్​కు చెందిన ఓ వ్యక్తిని ఏపీలోని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

Loan app
Loan app
author img

By

Published : Oct 15, 2022, 2:50 PM IST

Lone App gang member arrest: లోన్ యాప్ ద్వారా ప్రజలను వేధింపులకు గురి చేస్తూ.. మోసం చేస్తున్న రాజస్థాన్​కు చెందిన అంతర్జాతీయ ముఠా సభ్యుడిని ఆంధ్రప్రదేశ్​లోని వైఎస్ఆర్ కడప జిల్లా సీకే దిన్నే పోలీసులు అరెస్టు చేశారు. పది రోజుల కిందటే ఆరుగురు లోన్ యాప్ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిచ్చిన సమాచారం మేరకు రాజస్థాన్​కు వెళ్లి జాను యాదవ్ అనే నిందితుడిని అరెస్టు చేశారు.

జాన్ యాదవ్ బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తే దాదాపు రూ.20 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలిందని జిల్లా ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు. ఈ ముఠా సభ్యుడు హంకాంగ్​లోని ఇద్దరు ఘరానా మోసగాళ్లకు ఈ లోన్ యాప్ డబ్బులు పంపిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ పేర్కొన్నారు. హాంకాంగ్​లోని ఇద్దరు ముఠా సభ్యుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.