ETV Bharat / crime

మద్యం మత్తులో యువకుల వీరంగం.. బావిలో పడి ఇంటర్​ విద్యార్థి మృతి - ts news

Youngster died:యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరులో దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో యువకుల బృందం గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఓ యువకుడిపై దాడి చేయగా.. తప్పించుకునే ప్రయత్నంలో బావిలో పడి మృతిచెందాడు. యువకుడి మృతితో అతని కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి.

మద్యం మత్తులో యువకుల వీరంగం.. బావిలో పడి ఇంటర్​ విద్యార్థి మృతి

author img

By

Published : Jan 1, 2022, 7:05 PM IST

Youngster died: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో దారుణం జరిగింది. నూతన సంవత్సరం వేళ ఓ ఇంట్లో విషాదం నెలకొంది. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో యువకుల బృందం గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఓ యువకుడిపై దాడి చేయగా.. తప్పించుకునే ప్రయత్నంలో బావిలో పడి మృతి చెందాడు.

అసలేం జరిగిందంటే..

హైదరాబాద్​లోని మల్లాపూర్​కు చెందిన కళ్లెం రమేశ్​ తన మిత్రులు రాఘవ, మహేశ్​, బాబాలు కలిసి రెండు ద్విచక్రవాహనాలపై యాదగిరిగుట్టకు వెళ్తున్నారు. గూడూరు సమీపంలో ఓ ద్విచక్రవాహనంలో పెట్రోల్ అయిపోయింది. సాయం కోరుతూ అక్కడే గుమికూడిన గూడూరు యువకుల వద్దకు వెళ్లారు. వాళ్లు అంతకుముందే హైదరాబాద్​కు చెందిన మరికొందరితో గొడవ పడ్డారు. వాళ్లే మరోసారి తమను కొట్టడానికి వస్తున్నారని భావించి ఆ గూడూరుకు చెందిన యువకులు మల్లాపూర్​ యువకులను కొట్టేందుకు వెంబడించారు.

తప్పించుకునే ప్రయత్నంలో మల్లాపూర్‌ యువకులు పంట పొలాల్లోకి పరిగెత్తారు. వాళ్లలో రమేశ్‌ అనే యువకుడు టోల్ ప్లాజా సమీపంలోని బావిలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు బావిలోని నీటిని మోటార్‌తో తోడి మృతదేహాన్ని వెలికితీశారు. హైదరాబాద్ యువకులకు ఈ ప్రాంతం పట్ల అవగాహన లేకపోవటంతో బావిలో పడిపోయినట్లు స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. దాడికి పాల్పడిన 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు రమేశ్​ ప్రస్తుతం ఇంటర్​ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రమేశ్​ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.