ETV Bharat / crime

సోషల్ మీడియాలో చిన్ననాటి ఫొటోలు వైరల్.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య - తెలంగాణ క్రైమ్ న్యూస్

Young woman commits suicide: సాంకేతికతను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతున్న ప్రస్తుత రోజుల్లో... అదే సాంకేతికతకు కొందరు బలైపోతున్నారు. సరదాగా చిన్నప్పుడు తీసుకున్న ఫొటోలు రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఓ యవకుడితో ఆ అమ్మాయి తీసుకున్న చిన్ననాటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.

suicide
suicide
author img

By

Published : Nov 15, 2022, 10:37 PM IST

Young woman commits suicide: మేనత్త కొడుకుతో తాను తీసుకున్న ఫొటోలు వాట్సప్, ఫేస్​బుక్​లో వైరల్ అవడంతో మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అనంతపురం గ్రామానికి చెందిన మేఘలత(20) మేనత్త కొడుకు శివకుమార్​తో పదో తరగతిలో సరదాగా చిన్నప్పుడు కొన్ని ఫొటోలు తీసుకుంది. కానీ వాటిని కొందరు యువకులు వాట్సప్, ఫేస్​బుక్​లో వైరల్ చేశారు.

దీంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మేఘలతకు ఇప్పటికే హైదరాబాద్​కు చెందిన సాప్ట్​వేర్ ఉద్యోగితో వివాహం నిశ్చయం అయింది. ఇంతలో తనను గ్రామంలో కొందరు శివకుమార్​తో తీసుకున్న ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో ఆ బాధను తట్టుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోటు రాసి బలవన్మరణానికి పాల్పడింది.

ఈ స్టోరీలో మరో ట్విస్ట్ ఏంటంటే వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలు శివకుమారే తన స్నేహితులకు పంపాడు. ఇదిలా ఉంటే ఈ నెల 6న శివకుమార్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. ఒకే కుటుంబానికి ఇద్దరు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో.. చాపు డప్పులు వినాల్సి రావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.