మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాన్ దుకాణానికి వచ్చిన కొందరు యువకులు మత్తు పదార్థాల కోసం హల్చల్ చేశారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
మూడు రోజుల కిందట రాత్రి సమయంలో బోడుప్పల్‌లోని ఓ పాన్ షాపు వద్దకు ముగ్గురు యువకులు వచ్చారు. ఓసీబీ ప్రీమియం పేపర్(మత్తు పదార్థం) కావాలంటూ డిమాండ్ చేశారు. తమ వద్ద అలాంటి పదార్థాలు దొరకవని షాపు యజమాని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అతనిపై బండరాయితో దాడి చేసేందుకు యువకులు యత్నించారు. అక్కడి సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలతో బాధితుడు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు పాత గొడవలు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు కోసం కోర్టు నుంచి అనుమతి తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: lover murder: ప్రియురాలి గొంతు కోసి చంపి.. ఉరివేసుకున్న ప్రియుడు