ETV Bharat / crime

పవర్ ప్లాంట్​లో ప్రమాదం: ఒకరు మృతి - electrical accident at the Yadadri power plant in Nalgonda district

నల్గొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్​లో జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

young man was killed in an electrical accident at the Yadadri power plant in Nalgonda district
యాదాద్రి పవర్ ప్లాంట్​లో ప్రమాదం: ఒకరు మృతి
author img

By

Published : Feb 12, 2021, 2:39 AM IST

విద్యుత్ ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. దామచర్ల పరిధిలోని వీర్లపాలెంకు చెందిన గుమ్మం నరేష్(24) యాదాద్రి పవర్ ప్లాంట్​లో డైలీ లేబర్ ఎలక్ట్రిషన్​గా పని చేస్తున్నాడు. అతను సబ్ స్టేషన్​లో విద్యుత్ సరఫరా మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి వివాహం జరిగి నాలుగు నెలలు అవుతుందని.. తండ్రి చనిపోగా ఇంటికి పెద్దదిక్కుగా పవర్ ప్లాంట్​లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని స్థానికులు తెలిపారు.

ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో.. తల్లి, భార్యతోపాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:చెన్నై మెరీనా బీచ్‌లో ముగ్గురు ఏపీ విద్యార్థులు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.