ETV Bharat / crime

Suicide: అప్పు తీర్చేందుకు రూ.2 వేలు దొరకలేదని ఆత్మహత్య

అప్పు తీర్చేందుకు రూ.2 వేలు దొరకలేదని ఓ యువకుడు ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటన మేడ్చల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. రూ.2 వేల కోసం తనను ఎవరూ నమ్మలేదనే మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Oct 24, 2021, 8:01 AM IST

Suicide
Suicide

అప్పు తీర్చేందుకు రూ.2 వేలు దొరకలేదని యువకుడు ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటన మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం పొన్నాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మర్యాల ఆనంద్‌(23) తుర్కపల్లిలోని ఓ బయోటెక్‌ సంస్థలో పని చేస్తున్నారు. మూడు నెలల క్రితం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌కు చెందిన కుంచెరుకలి (ఊరూరా తిరిగి అప్పిచ్చే వారు) వద్ద రూ.10వేలు అప్పు తీసుకున్నాడు. అప్పును తీర్చాలని ఓ మహిళతో పాటు మరో ఐదుగురు ఈ నెల 22న పొన్నాలలోని ఆనంద్‌ ఇంటికి వచ్చారు. తీవ్ర ఒత్తిడి చేశారు. కనీసం రూ.2 వేలు ఇస్తే కొత్త పత్రం రాసుకొని వెళ్తామని మొండికేసి కూర్చున్నారు.

ఆనంద్‌ తనకు తెలిసిన వారి దగ్గర అడిగారు. ఎవరూ ఇవ్వడానికి ముందుకు రాలేదు. వారు డబ్బు ఇచ్చే వరకు వెళ్లేది లేదని అతని వద్దే కూర్చున్నారు. నగదు ఇచ్చే వరకు తమతో పాటు రావాలని చెప్పగా శనివారం రోజు తుర్కపల్లి వరకు వెళ్లాడు. తెలిసిన వారిని బతిమాలిడితే ఒకరు రూ.వెయ్యి ఇచ్చారు. వాటితో వారికి విందు ఇచ్చాడు. వారు కొత్త పత్రం రాసుకొని వెళ్లి పోయారు. ఇంటికొచ్చిన ఆనంద్‌ రూ.2 వేల కోసం తనను ఎవరూ నమ్మలేదని మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Suicide: అవమానం తట్టుకోలేక సర్పంచ్​ పశువుల కొట్టంలో బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.