బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో జరిగిందీ ఘటన.
గ్రామానికి చెందిన జూపల్లి అంజమ్మ.. భర్త మూడేళ్ల క్రితం మృతి చెందటంతో దినసరి కూలీగా పని చేస్తూ జీవిస్తోంది. ఆమె కుమారుడు చంద్ర మోహన్ (23) కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. కొవిడ్ కారణంగా ఇంటివద్దే ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. ఈ తరుణంలోనే బైక్ కొని, తనకు పెళ్లి చేయాలంటూ కొద్ది రోజులుగా తల్లిని వేధించేవాడు.
ఇలాగే గురువారం నాడు.. వాహనం కొనేందుకు సరిపడా డబ్బులు లేవంటూ కొంతకాలం ఆగాలని సూచించిన తల్లితో వాగ్వాదానికి దిగాడు. మనస్తాపం చెంది.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఏటీఎం యంత్రం ధ్వంసానికి యత్నించిన దుండగుడు