విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై ఓ యువకుడు దాడి చేసిన ఘటన సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మార్కండేయ నగర్లో నివసించే శ్రీనాథ్, పరమేష్లకు మంగళవారం అర్ధరాత్రి.. ఓ మహిళ విషయంలో ఘర్షణ తలెత్తింది. గొడవ పెద్దదై పరమేష్‌పై శ్రీనాథ్ దాడికి దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని పరమేష్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు శ్రీనాథ్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు.
పోలీస్‌స్టేషన్‌లో శ్రీనాథ్ తన వద్ద ఉన్న బ్లేడ్‌తో అక్కడే ఉన్న కానిస్టేబుల్ కిరణ్ మెడపై దాడి చేశాడు. మెడపైన గాయాలు కావడంతో సిబ్బంది హుటాహుటిన కానిస్టేబుల్ కిరణ్‌ను యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీనాథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉంది.
ఇదీ చదవండి: మత్తు మందుల అక్రమ రవాణా.. తప్పించుకుంటున్న సూత్రధారులు