ETV Bharat / crime

చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు - telangana latest crime news

ఈ నెల 23న యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును చౌటుప్పల్ ఏసీపీ ఆధ్వర్యంలో నారాయణ పురం పోలీసులు చేదించారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు యాదాద్రి డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు.

chain snatching case
చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు
author img

By

Published : Mar 27, 2021, 7:51 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం శివారులో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. నారాయణ పురం శివారులో కల్లు విక్రయిస్తున్న ఆండాళు అనే మహిళ వద్ద కల్లు తాగడానికి వచ్చిన నిందితులు ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడుపై కన్నేశారు. ఆమెను కత్తితో బెదిరించి మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు అపహరించుకు పోయారు.

బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ రోజు ఉదయం వలిగొండ శివారులో తనిఖీలు చేస్తుండగా అనుమానంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజాన్ని అంగీకరించినట్లు యాదాద్రి డీసీపీ నారాయణ రెడ్డి వివరించారు. నిందితులు వలిగొండ మండలానికి చెందిన హరీశ్, నరేశ్​లుగా గుర్తించారు. వారి నుంచి తులం బంగారం, రెండు సెల్ ఫోన్​లు, కత్తితో పాటు ఓ బైక్ స్వాధీనం చేసుకుని.. రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి: మయన్మార్​ నిరసనల్లో 91కి చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.