ETV Bharat / crime

పెళ్లి రోజున సరదాగా బీచ్​కు వెళ్లిన జంట.. అంతలోనే విషాదం..

Women vanished in Beach: పెళ్లి రోజున సరదాగా భర్తతో కలిసి సముద్రపు ఒడ్డుకు వెళ్లిన ఓ యువతి అలల తాకిడికి సముద్రంలో గల్లంతైంది. ఈ విషాదకర ఘటన ఏపీలోని విశాఖ ఆర్కే బీచ్​లో నిన్న సాయంత్రం చోటు చేసుకోగా.. కోస్ట్​ గార్డుకు చెందిన హెలికాప్టర్, రెండు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

women-vanished-in-vishaka-rk-beach
women-vanished-in-vishaka-rk-beach
author img

By

Published : Jul 26, 2022, 4:11 PM IST

Women vanished in Beach: ఏపీలోని విశాఖ ఆర్కే బీచ్​లో ఓ వివాహిత గల్లంతైంది. ఆమె ఆచూకీ కోసం కోస్ట్​గార్డుకు చెందిన హెలికాప్టర్​, రెండు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ ఎన్​ఏడీ కి చెందిన చిరిగిడి సాయిప్రియ (21) విజయవాడకు చెందిన శ్రీనివాసరావు భార్యాభర్తలు. భర్త శ్రీనివాసరావు వృత్తి రీత్యా హైదరాబాద్​లో ఉంటున్నారు. వారం రోజుల క్రితం సాయిప్రియను కలవడానికి శ్రీనివాసరావు విశాఖకు వచ్చారు. నిన్న పెళ్లి రోజు కావటంతో సరదగా ఆర్కే బీచ్​కు వెళ్లారు. శ్రీనివాసరావు బీచ్ ఒడ్డున ఉండగా.. సాయిప్రియ సముద్రంలోకి వెళ్లింది. శ్రీనివాసరావు ఫోన్ చూసుకుంటుండగా.. సాయిప్రియ అలలతాకిడికి సముద్రంలో గల్లంతైంది. దీంతో ఆమె భర్త త్రీ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి ఎంత వెతికినా ఆచూకీ కనిపించకపోవటంతో.. ఇవాళ ఉదయం కోస్ట్​ గార్డుకు చెందిన ఒక హెలికాప్టర్, రెండు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

సాయిప్రియ ఆచూకీ కోసం కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. నగర మేయర్ హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్ శ్రీధర్​లు గాలింపు చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. బీచ్​లో హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ పర్యటకులు వాటిని గమనించకుండా సముద్ర స్నానానికి దిగి ప్రాణాలు కోల్పోతున్నారని మేయర్ అన్నారు. సముద్ర తీరంలో లైఫ్​గార్డుల నిర్వహణ పోలీస్ శాఖ చూసుకుంటుందని తెలిపారు. గత కొన్ని నెలలుగా జీతాలు అందకపోవటంతో వారు విధులకు హాజరుకావటం లేదని అన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.