ETV Bharat / crime

Young Woman Suicide: ఆ పని తప్పని చెప్పినందుకు ఉరేసుకుని చనిపోయింది! - telangana news

ఫోన్​ ఎక్కువగా చూస్తుందని... కుటుంబ సభ్యులు మందలించడంతో ఓ యువతి ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా బసినికొండలో జరిగింది.

Young Woman Suicide, girl suicide due to phone
యువతి ఆత్మహత్య, ఫోన్ కారణంగా యువతి ఆత్మహత్య
author img

By

Published : Sep 1, 2021, 2:10 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం బసినికొండలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్​కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన ఎస్‌.సల్మా(17)... ఈ మధ్య ఫోన్​ ఎక్కువగా మాట్లాడుతోంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు తరచూ ఫోన్​ వాడొద్దని... ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావు అంతసేపంటూ మందలించారని స్థానికులు తెలిపారు.

కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెందిన సల్మా... ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దు అన్నందుకే కూతురు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Girl Suicide: చెత్తకుండీలో నవజాత శిశువు.. బావిలో తల్లి మృతదేహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.