ETV Bharat / crime

Suicide Attempt: ఎస్సై తిట్టాడని మహిళ ఆత్మహత్యాయత్నం.. - Women Suicide Attempt

Suicide Attempt: తన కుమార్తె మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే.. పోలీసులు దుర్భాషలాడారన్న మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తోన్న ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్​ చేస్తున్నారు.

Women Suicide Attempt for scolding si in vemulapally

author img

By

Published : Jan 25, 2022, 4:39 PM IST

Suicide Attempt: తన కూతురి మరణానికి కారణమైన వ్యక్తిపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. పోలీసులు దుర్భాషలాడటమే కాకుండా దురుసుగా ప్రవర్తించారని మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లిలో జరిగింది.

సల్కునూరుకు చెందిన తుపాకుల మల్లేష్, సరిత దంపతులకు ఇద్దరు సంతానం కాగా.. కూతురు మిర్యాలగూడలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆ అమ్మాయి తన స్నేహితులతో చనువుగా ఉన్న ఫొటోలను అదే గ్రామానికి చెందిన 6వ వార్డు మెంబర్ సైదులు దొంగచాటుగా చిత్రీకరించి తల్లిదండ్రులకు చేరవేశారు. ఆ ఫొటోలను చూసిన తల్లిదండ్రులు.. కూతురిని కాస్త మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమ్మాయి.. డిసెంబర్ 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు మృతికి సైదులు అందించిన తప్పుడు సమాచారమే కారణమంటూ తల్లిదండ్రులు వేములపల్లి పోలీస్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

తనపై ఫిర్యాదు చేశారన్న కోపంతో.. సరిత ఇంటిపై సైదులు దాడి చేశాడు. ఈ విషయాన్ని కూడా బాధితులు పోలీసులకు తెలిపారు. అయినా పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు లేవు. మళ్లీ ఓసారి ఇదే విషయమై మాట్లాడే క్రమంలో ఎస్సై రాజు తమను దూషించారని బాధితులు ఆరోపించారు. న్యాయం చేయకపోగా తిరిగి తమనే తిడుతున్నారని మనస్తాపం చెందిన సరిత.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులతో దురుసుగా ప్రవర్తించిన ఎస్సై రాజుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.