ETV Bharat / crime

cyber crime: ఆన్​లైన్ షాపింగ్ పెట్టుబడి పేరిట.. లక్షల్లో కాజేసిన సైబర్ కేటుగాళ్లు

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకుల నుంచి లక్షల్లో కాజేస్తున్నారు. ఆన్​లైన్ షాపింగ్ పెట్టుబడుల ప్రకటనను నమ్మిన ఓ మహిళ రూ.2.10లక్షలను పోగొట్టుకున్నారు.

cyber crime, online shopping advertisement
సైబర్ క్రైం, ఆన్​లైన్ షాపింగ్ పెట్టుబడి
author img

By

Published : Jun 26, 2021, 6:53 PM IST

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఫేస్​బుక్​లో ప్రకటనలు పెట్టి అమాయకులను మోసం చేస్తున్నారు. ఆన్​లైన్ షాపింగ్ పెట్టుబడి అంటూ హైదరాబాద్​లోని బాలానగర్​కు చెందిన మహిళ నుంచి రూ.2.10 లక్షలు కాజేశారు.

ఆన్​లైన్ షాపింగ్ పెట్టుబడి అంటూ ఫేస్​బుక్​లో ప్రకటనను చూసి డబ్బులను పోగొట్టుకున్న ఆదర్శ్ నగర్​కు చెందిన ఆర్తి ప్రియ పోలీసులను ఆశ్రయించారు. తాము పంపే లింక్ ద్వారా రిజిస్టర్ అయ్యి అందులో పెట్టుబడి పెట్టాలంటూ సైబర్ కేటుగాళ్లు వాట్సాప్​లో మెసేజ్ చేశారని తెలిపారు. అది నమ్మి పలు దఫాలుగా రూ.2.10లక్షలను చెల్లించినట్లు వెల్లడించారు.

ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయని బాధితురాలు అడగగా... మరికొంత నగదు చెల్లిస్తేనే వస్తాయని అన్నారని పేర్కొన్నారు. లేదంటే డబ్బులు రావని బుకాయించారని వాపోయారు.చివరకు మోసపోయానని గ్రహించిన బాధితురాలు బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: suicide: పన్నెండేళ్ల ప్రాయం.. ఎవరూ లేని సమయంలో బలవన్మరణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.