మెదక్ జిల్లా అల్లాదుర్గంలో పెట్రోల్ దాడికి గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. బాకీ అడిగినందుకు సోమవారం ఓ పశువుల వ్యాపారి మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 80 శాతం కాలిన గాయాలతో విషమ స్థితిలో ఉన్న మహిళను...హైద్రాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న బాధిత మహిళ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్న పోలీసులు...కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి : మహిళపై దాడి చేసి నిప్పింటిన దుండగుడు