నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి గుంతలో ఓ మహిళ మృతదేహం లభ్యమైన ఘటన హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో చోటుచేసుకుంది. మృతురాలు భారతమ్మగా పోలీసులు గుర్తించారు. శివరాత్రి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా నుంచి దాదాపు 15 మంది భిక్షాటన కోసం హైదరాబాద్కు వచ్చారని.. అందరూ తమ ఊళ్లకు వెళ్లిపోయారు.
భారతమ్మ తిరిగి రాకపోవడం వల్ల ఆమె బంధువు రమేశ్ చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో వెతకగా... మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి : శంషాబాద్లో రెండు రోజుల్లో 1,065 గ్రాముల బంగారం సీజ్