ETV Bharat / crime

Crime News : మహిళపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య - Vijayawada Rape Case News

Woman Rape in Vijayawada : విజయవాడలో అమానుషం చోటుచేసుకుంది. కళ్ల ముందే భర్త ఓ మహిళపై అత్యాచారం చేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి... అతని భార్య ఆ దృశ్యాలను ఫోన్​లో వీడియో తీసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Woman Rape in Vijayawada
Woman Rape in Vijayawada
author img

By

Published : Feb 9, 2022, 9:27 AM IST

Updated : Feb 9, 2022, 10:05 AM IST

Woman Rape in Vijayawada : ఆడదానికి ఆడదే శత్రువు అనే సామెతకు నిదర్శనం ఈ మహిళ. కళ్ల ముందే భర్త మరో మహిళపై అఘాయిత్యానికి పాల్పడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి పైశాచికంగా వ్యవహరించింది. తప్పు చేస్తున్న భర్తకు సహకరించి.. మరో మహిళపై అతడు అత్యాచారానికి పాల్పడుతుండగా ఆ దృశ్యాలను ఫోన్​లో రికార్డు చేసింది. ఈ అమానుష ఘటన ఏపీలోని విజయవాడలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Vijayawada Rape Case News : విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌ పరిసర ప్రాంతంలో ఓ వివాహిత (25) భర్త కేటరింగ్‌ పని చేస్తుంటారు. ఈ నెల 3వ తేదీ రాత్రి ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోతోంది. వీరి ఎదురింట్లో దిలీప్‌, తులసి అనే భార్యాభర్తలు ఉంటున్నారు. రాత్రి 11 గంటల సమయంలో వివాహిత ఇంట్లోకి వారు అక్రమంగా ప్రవేశించారు. వివాహిత నోరు మూసి, తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆమెపై భర్త రెండు సార్లు అత్యాచారం చేయగా, అతడి భార్య వీడియో, ఫొటోలు తీసింది.

తర్వాతి రోజు కూడా ఆమెను బెదిరించి మరోసారి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పిల్లలిద్దరినీ చంపేస్తానని, ఫొటోలను అందరికీ చూపించి పరువు తీస్తానని బెదిరించాడు. అంతేకాకుండా, తన స్నేహితుల కోరిక తీర్చాలని బెదిరిస్తుండడంతో బాధితురాలు మహిళా పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఘటనపై ఫిర్యాదు చేయగా, భార్యాభర్తలపై ఐపీసీ 376(2), 354బి, 354డి, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి : Rape attempt on beggar: భిక్షాటన చేసే పాపపై పెయింటర్​ అత్యాచారయత్నం..

Last Updated : Feb 9, 2022, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.