మూడు వందల రూపాయల రిఫండ్ కోసం ప్రయత్నించబోయి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కిన ఓ మహిళ రూ.1.90 లక్షలు నష్టపోయింది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఆన్లైన్లో ఓ వస్తువు ఆర్డర్ పెట్టింది. ఆ వస్తువును డెలివరీ చేసిన డెలివరీ బాయ్ రూ.300 అదనంగా తీసుకున్నాడని సదరు ఈ-కామర్స్ సంస్థకు ఫిర్యాదు చేయాలనుకుంది.
గూగుల్‌లో ఉన్న కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసింది. కస్టమర్ కేర్ ఆపరేటర్‌గా మాట్లాడిన ఓ సైబర్ కేటుగాడు.. డబ్బులు రిఫండ్ చేస్తామని.. యూపీఐ, ఐడీ, పాస్వర్డ్ తీసుకుని ఆమె అకౌంట్లో ఉన్న రూ.1.90 లక్షలు మాయం చేశారు. మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరో కేసులో.. కొవిడ్ ఇంజక్షన్ పేరుతో ఓ వ్యక్తి వద్ద సైబర్ కేటుగాళ్లు రూ.1.6 లక్షలు కాజేశారు. ఎన్నిరకాల ఎత్తుగడలు వేసినా.. సైబర్ నేరగాళ్లు రోజుకో పంథా అనుసరిస్తూ సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రజలంతా సైబర్ వలకు చిక్కకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
- ఇదీ చదవండి : మానింది మందు... బతికింది ఊరు