బీటెక్ చదివిన యువకుడు.. తండ్రి లేని యువతిని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరిలో పెళ్లైనా.. ఇప్పటివరకు ఆమె కాపురానికి రాలేదు... ఎందుకు రావడం లేదని యువకుడి తరపు పెద్దలు అడిగితే.. గుంటూరులో ఇల్లు తీసుకుంటే వస్తానని చెప్పింది.. ఆమె చెప్పినట్లే ఇల్లు తీసుకుని కాపురం పెట్టగా.. తనను తాకవద్దని మళ్లీ పుట్టింటికి వెళ్లింది.. గట్టిగా నీలదీస్తే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎందుకిలా చేస్తుందని ఆరా తీస్తే అతనికి అనేక వాస్తవాలు తెలిశాయి.. దీంతో అతను తనకు న్యాయం చేయాలంటూ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
‘నేను బీటెక్ చదివాను. ప్రస్తుతం గుంటూరులో మోటార్ కంట్రోలర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాను. తండ్రి పోలియోతో, తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక్కడినే కుమారుడి. రెవెన్యూశాఖలోని ఓ విశ్రాంత ఉద్యోగి పరిచయమై జిల్లాలోని ఓ వీఆర్వో కుమార్తెతో వివాహం కుదిర్చారు. తండ్రిలేరని తాను కట్నం ఇచ్చుకోలేనని తల్లి చెప్పడంతో పైసా కట్నంలేకుండా పెళ్లికి అంగీకరించాం. ఫిబ్రవరిలో వివాహమైంది. అమ్మాయికి రూ. 2 లక్షలతో ఆభరణాలు చేయించాం. మా ఊరులో రూ. 6 లక్షలతో రిసెప్షన్ చేశాం. వెంటనే ఆమె తన కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లింది. తొలిరాత్రి నుంచి యువతి నన్ను దూరంపెట్టింది. ఒక్కరోజు కూడా కాపురం చేయలేదు. నెలల తరబడిగా ఆమె పుట్టింటి నుంచి రావడంలేదు. మా పెద్దలు వెళ్లి అడిగితే గుంటూరులో ఇల్లు అద్దెకు తీసుకోమన్నారు. ఒకరోజు ఉండి తనను తాకవద్దంటూ రెండోరోజు పుట్టింటికి వెళ్లిపోయింది. గట్టిగా నిలదీయడంతో కట్నం ఇవ్వమంటున్నారని మాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 10 లక్షల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలోనే మాకు తెలిసింది మా అత్త వీఆర్వోగా పనిచేసిన గ్రామంలో గతేడాది ఓ ఎయిర్‌ఫోర్సు ఉద్యోగితో నిశ్చితార్థం చేశారట. ఆ విషయం దాచిపెట్టి మాతో వివాహమంటూ తతంగం నడిపారు. మరొకరితో పెళ్లి తంతు నడుపుతూ నా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారనిపిస్తోంది. మమ్మల్ని మోసగించిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలి’ -శ్రీనివాసరావు, బాధితుడు
ఇవీ చదవండి:
హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం.. హాజరైన సీఎం కేసీఆర్