witchcraft-in-village: సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా కొందరిలో మూఢ నమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. క్షుద్రపూజలు చేస్తున్నారని వారిని హత్య చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. క్షుద్రపూజల పేరిట కొందరు మోసం చేసిన ఘటనలు కూడా గతంలో వెలుగుచూశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామశివారులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు.
గ్రామానికి చెందిన ఉప్పు కృష్ణ అనే రైతుకు చెందిన కొట్టంలో కొందరు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు లభించాయి. రోజులాగే ఉదయం పశువుల కొట్టం దగ్గరకు వెళ్లిన కృష్ణ... అక్కడ పసుపు, కుంకుమతో క్షుద్రపూజలు చేసినట్లు అనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: