ETV Bharat / crime

సినీ ఫక్కీలో స్కెచ్ వేశాడు.. భార్యను చంపించేశాడు!

author img

By

Published : Feb 2, 2021, 8:53 AM IST

జీవింతాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేశాడు. కానీ ఓ చిన్న అనుమానం వారి మధ్య పెనుభూతంగా మారింది. ఇక భార్యను వదిలించుకోవాలని అనుకున్నాడు. సినీ ఫక్కీలో మర్డర్​ చేయించి... ప్రమాదంగా చిత్రీకరించాడు. కానీ పోలీసుల విచారణలో నిజం బయటకు వచ్చి... దొరికిపోయాడు. అసలు ఏం జరిగింది? ఏమైంది.?

'సినీ ఫక్కీలో భార్యను హత్య చేసి.. ప్రమాదంగా చిత్రీకరించాడు'

మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలం బండర్​పల్లి గ్రామానికి చెందిన బుడగ జంగాల రవి... కారు డ్రైవర్​గా ఉంటూ.. కుటుంబాన్ని పోషించేవాడు. 2017లో మాలతితో వివాహం జరిగింది. వివాహం అయిన కొన్నాళ్లకే భార్యపై అనుమానం పెనుభూతంగా మారింది. భార్యను హత్య చేసేందుకు సినీ ఫక్కీలో పన్నాగం వేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తన భార్యను హత్య చేయించి వదిలించుకున్నాడు.

అసలేం జరిగిందంటే..

భార్యను చంపడం కోసం సినీ ఫక్కీలో ఓ ప్లాన్ వేశాడు. ఆమె పేరుపై బీమా చేయించాడు. తన సోదరుడైన రామాంజనేయుల సహాయంతో లారీ డ్రైవర్​ కేతావత్ వినోద్​కి తన ప్లాన్​ వివరించాడు. పక్కగా అమలు చేస్తే.. బీమా డబ్బులు 15 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు.

ఒప్పందం ప్రకారం జనవరి 25న మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాలతి పొలం పనులు ముగించుకుని కట్టెలమోపుతో నడుచుకుంటూ ఇంటికి పయనమైంది. ఇదే సరైన సమయం అనుకున్న తన భర్త... లారీతో గుద్దించాడు. మాలతి అక్కడిక్కడే మృతి చెందింది. అందరు దీనిని ఓ ప్రమాదమని అనుకున్నారు. మొదట పోలీసులు దీనిని రోడ్డు ప్రమాద కేసుగా నమోదు చేసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్తనే హత్య చేయించి ఉంటాడని అనుమానంతో వేరే కోణంలో విచారణ ప్రారంభించారు. విచారణలో తన భార్య హత్య పన్నాగాన్ని పోలీసులకు రవి వివరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.