ETV Bharat / crime

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్నవాడిని కడతేర్చింది! - తెలంగాణ ప్రధాన వార్తలు

Wife Killed Husband at Panagal : జీవింతాంతం తోడుగా నిలవాల్సిన భార్య... ఆ భర్త పాలిట యమపాశంగా మారింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని... ప్రియుడితో కలిసి కట్టుకున్న వాడిని కడతేర్చింది. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగింది.

Wife Killed Husband at Panagal, husband murder case
పానగల్​లో భర్తను చంపిన భార్య
author img

By

Published : Jan 31, 2022, 1:01 PM IST

Wife Killed Husband at Panagal : వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఓ వివాహిత. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగింది. పానగల్​కు చెందిన సుజాత అనే మహిళ లింగస్వామి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని... కట్టుకున్న భర్తనే కడతేర్చిందని పోలీసులు తెలిపారు.

ఏం జరిగింది?

ఆదివారం తెల్లవారుజామున సుమారు 12 నుంచి 2 గంటల ప్రాంతంలో.. పానగల్లుకు చెందిన ఇరగదిండ్ల వెంకన్న హత్యకు గురయ్యాడు. వెంకన్న భార్య సుజాత,

నార్కట్​పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన కప్ప లింగస్వామి కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వెంకన్న ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో సుజాత సాయంతో... లింగస్వామి దిండుతో ఈ హత్య చేసినట్లు నల్గొండ టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి వివరించారు.

కేసు నమోదు

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే సుజాత, లింగస్వామితో కలిసి ఈ కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. గతంలో కూడా హత్యాయత్నం చేసిందని పేర్కొన్నారు. మృతుని తండ్రి ఇరగదిండ్ల భిక్షమయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు.

ఇదీ చదవండి: మద్యం మత్తులో తల్లిని చితకబాదిన కుమారుడు.. చికిత్స పొందుతూ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.