నిజామాబాద్ జిల్లా ఐదో టౌన్ పరిధి నాగారంలో భార్యను కిరాతకంగా హత్య చేశాడో భర్త. నాగారం 80 క్వార్టర్స్ కాలనీకి చెందిన షహనాజ్ బేగం(30)ను భర్త షేక్ సల్మాన్ కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. షహనాజ్ బేగానికి సల్మాన్‌తో 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల భార్యపై సల్మాన్ అనుమానం పెంచుకుని.. ఈ దారుణానికి తెగబడ్డాడని పోలీసులు తెలిపారు.
రెండు నెలల కిందట షహనాజ్ పిల్లలతో పాటు పుట్టింటికి వెళ్లిపోయింది. ఇరువురు కుటుంబ సభ్యులు సముదాయించడంతో ఆమె అత్తింటికి వచ్చింది. సోమవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సల్మాన్ కత్తితో భార్య గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు షేక్ సల్మాన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు రూరల్ సౌత్ సీఐ గురునాథ్ తెలిపారు.
ఇదీ చూడండి: కానిస్టేబుల్ పేరుతో రూ.26 లక్షలు కొట్టేశాడు!