ETV Bharat / crime

PETROL: 'పెట్రోల్ నింపితే వాహనాలు మొరాయిస్తున్నాయ్' - కరీంనగర్​లో కల్తీ పెట్రోల్

పెట్రోల్​ రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఏమి చేయలేని స్థితిలో... అవసరాల నిమిత్తం వాహనాలు వినియోగిస్తున్నాం. ఇలాంటి తరుణంలో పెట్రోల్​లో నీళ్లు కలిపి... విక్రయించారు ఓ బంక్​ నిర్వాహకులు. వాహనాలు మొరాయించడంతో మెకానిక్​ వద్దకు తీసుకెళ్లగా.. అసలు విషయం బయటపడింది.

water-mixed-with-petrol-at-bommakal-in-karimnagar-district
పెట్రోల్​లో నీళ్లు
author img

By

Published : Aug 2, 2021, 1:59 PM IST

కరీంనగర్ శివారులోని బొమ్మకల్​లో... ఓ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్​లో నీరు కలుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు వాహనాల్లో పెట్రోల్ పోయించుకుని వెళ్లిన వాహనదారులు... కొద్ది సేపటికే మెురాయించటంతో మెకానిక్ వద్దకు తీసుకెళ్లారు. పెట్రోల్ కి బదులు నీరు పోయడం కారణంగా వాహనాలు నిలిచిపోయాయని చెప్పటంతో... వాహనదారులు ఆందోళన చేశారు.

పెట్రోల్​లో నీళ్లు

బొమ్మకల్ ఉపసర్పంచ్​తో పాటు స్థానికులు, వాహనదారులు పెట్రోల్​బంక్​కు వెళ్లారు. అనంతరం పెట్రోలును పరిశీలించగా... నీళ్లు రావటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్ వద్ద లీకేజీ ఏర్పడిందంటూ బంకు నిర్వహకులు తాత్కాలికంగా మూసివేశారు. మరమ్మతుల అనంతరం మళ్లీ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: Petrol gift: తెరాస నాయకుడి పెళ్లిలో కాంగ్రెస్​ నేతలు.. కానుకగా ఏం ఇచ్చారంటే.?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.