ETV Bharat / crime

తనను దూరం పెడుతోందని మరదలును చంపిన అక్క భర్త.! - వర్ధన్నపేట

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో నాలుగు రోజుల క్రితం మహిళ అదృశ్యమైన కేసును వర్ధన్నపేట పోలీసులు ఛేదించారు. అక్క భర్తే హంతకుడని తేల్చారు.

Warangal Rural woman missing case solved police found that her sister husband is the killer
అక్క భర్తే అసలు హంతకుడు!
author img

By

Published : Jan 26, 2021, 7:46 AM IST

భార్య చెల్లెలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. అనుమానంతో మరదలిని దారుణంగా హత్య చేశాడు. వేరొకరితో సన్నిహితంగా ఉండటం చూసి భరించలేక.. ఆమెను హతమార్చాడు. ఆపై భార్య సాయంతో మృతదేహాన్ని కాలువలో పడేసి చేతులు దులుపుకున్నాడు. నాలుగు రోజుల క్రితం నమోదైన మహిళ అదృశ్యమైన కేసును వర్ధన్నపేట పోలీసులు ఛేదించారు. అక్క భర్తే హంతకుడని వారు తేల్చి చెప్పారు.

వివరాల్లోకి వెళ్తే..

రోడ్డు ప్రమాదంలో భర్తను పోగొట్టుకున్న మృతురాలు వనిత.. 5 సంవత్సరాలుగా తన ముగ్గురు పిల్లలతో కలిసి దేవరుప్పుల మండలం పెద్దతండాలో నివాసముంటోంది. ఈ క్రమంలో అక్క భర్త యాకూబ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఈనెల 22న వనిత వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన యాకూబ్ కోపంతో రగిలిపోయాడు. రాయపర్తి సమీపంలోని తన మొక్కజొన్న చేనుకు వనితను బలవంతంగా తీసుకెళ్లాడు. వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్‌తో ఆమెపై తీవ్రంగా దాడి చేసి హతమార్చాడు.

భయాందోళనకు గురైన యాకూబ్.. భార్య సునీతకు జరిగిన విషయం చెప్పి సాయం కోరాడు. భార్యాభర్తలిద్దరు వనిత మృతదేహాన్ని డీసీ తండా శివారులోని ఎస్సారెస్పీ కెనాల్‌లో పడేశారు.

కేసుపై దర్యాప్తు చేపట్టిన వర్ధన్నపేట పోలీసులు.. నిందితుడు యాకుబ్‌ను అరెస్ట్‌ చేశారు. మరో నిందితురాలు సునీత పరారీలో ఉన్నట్లు ఏసీపీ రమేష్ తెలిపారు.

క్షణికావేశంలో జరిగిన దారుణం వల్ల మృతురాలి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. తల్లి శవం చూసి బోరున విలపించారు.

ఇదీ చదవండి: గోల్నాకలో.. దంపతుల బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.