VRA Suicide in Kamareddy: వీఆర్ఏ ఆత్మహత్యతో కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. నాగిరెడ్డి పేట్ మండలం బొల్లారంకు చెందిన గ్రామ రెవెన్యూ సహాయకుడు అశోక్.. బొల్లారం సమీపంలో గుట్టపై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి సమయంలో ఘటన జరగ్గా.. ఉదయం విషయం తెలిసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం చెయ్యనివ్వకుండా తోటి వీఆర్ఏలు అడ్డుకున్నారు. రోడ్డుపై మృతదేహంతో ఆందోళన చేసే ప్రయత్నం చెయ్యగా పోలీసులు అడ్డుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో ట్రాక్టర్లో మృతదేహం ఉండగా.. వాహనం ముందు భైఠాయించి వారు ఆందోళన చేశారు. వీరికి వివిధ పార్టీల స్థానిక నాయకులు మద్దతు తెలిపారు. వీఆర్ఏల పే స్కేల్ కోసం నాగిరెడ్డిపేట్లో నిత్యం జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో అశోక్ చురుగ్గా పాల్గొనేవాడు. పే స్కేల్ అమలు చేయకపోవడం వల్లే అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి వీఆర్ఏలు ఆరోపిస్తున్నారు. అశోక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: