ETV Bharat / crime

DHARNA: వ్యక్తి మృతి.. డీఎంహెచ్​వోను సస్పెండ్​ చేయాలంటూ గ్రామస్థుల ధర్నా

అంబులెన్స్​ అందుబాటులో ఉన్నా.. సమయానికి కేటాయించకపోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడంటూ వనపర్తి జిల్లా వీపనగండ్లలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదుట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఒకరి మృతికి కారణమైన డీఎంహెచ్​వోను సస్పెండ్​ చేయాలంటూ డిమాండ్​ చేశారు.

DHARNA: వ్యక్తి మృతి.. డీఎంహెచ్​వోను సస్పెండ్​ చేయాలంటూ గ్రామస్థుల ధర్నా
DHARNA: వ్యక్తి మృతి.. డీఎంహెచ్​వోను సస్పెండ్​ చేయాలంటూ గ్రామస్థుల ధర్నా
author img

By

Published : Aug 21, 2021, 4:12 PM IST

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదుట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అంబులెన్స్​ అందుబాటులో ఉన్నా.. ఇవ్వకపోవడంతో గ్రామానికి చెందిన మల్లేశ్​ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడంటూ ధర్నా చేపట్టారు.

గ్రామానికి చెందిన మల్లేశ్​కు గుండెపోటు రావడంతో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. మల్లేశ్​ను పరీక్షించిన వైద్య సిబ్బంది.. వనపర్తి ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో మల్లేశ్​ను తరలించేందుకు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఉన్న అంబులెన్స్​ను అడగగా.. డీఎంహెచ్​వో చంద్రు నాయక్​ అనుమతించలేదు. ఫలితంగా చేసేదేమీ లేక ప్రైవేట్​ వాహనాన్ని పిలిపించుకుని బాధితుడిని వనపర్తికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

దీంతో డీఎంహెచ్​వో చంద్రు నాయక్ నిర్లక్ష్యం కారణంగానే మల్లేశ్​ మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. సమయానికి అంబులెన్స్​ కేటాయించినట్లయితే మల్లేశ్​ బతికేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డీఎంహెచ్​వోను సస్పెండ్​ చేయాలంటూ బంధువులు, గ్రామస్థులతో కలిసి ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబసభ్యులకు నచ్చజెప్పారు. దీంతో ఆందోళన విరమించారు. ఇంతకముందు వీపనగండ్ల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్​ సౌకర్యం లేదు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తన సొంత ఖర్చులతో అంబులెన్స్​ను ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: Live Video: కొండపై నుంచి జారిపడి పూజారి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.