రొయ్యల పరిశ్రమ యాజమాన్యంపై ఆగ్రహించిన కొందరు గ్రామస్థులు.. సముద్రం నుంచి వచ్చే పైప్లైన్లతో పాటు మంచినీటి పైపులైను పూర్తిగా ధ్వంసం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురం మండలం దెబ్బలపాలెంలో చోటు చేసుకుంది. నీరు అందక.. రూ. 50 లక్షలు విలువ చేసే రొయ్య పిల్లలు మరణించినట్లు ఎపేక్స్ రొయ్యల పరిశ్రమ యాజమాన్యం పేర్కొంది. గ్రామంలో దేవాలయ నిర్మాణానికి 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చెయ్యగా.. యాజమాన్యం 12 లక్షలు ఇస్తామనడమే.. గ్రామస్థుల ఆగ్రహానికి కారణమైంది
సముద్రం నుంచి వచ్చే పైప్ లైన్తోపాటుగా మంచి నీటి పైపులను సైతం గ్రామస్థులు పూర్తిగా ధ్వంసం చేశారు. యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహేష్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఘటనకు కారణమైన గుడ్ల శివ, నర్సింగ్, మరో ఇద్దరిని గుర్తించి.. అదుపులో తీసుకొన్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చూడండి: లారీని తప్పించబోయి డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..