వ్యాయామం చేస్తుండగా డంబెల్స్ మీద పడి యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సిరాజ్(19) ఆరు నెలల క్రితం జిల్లాకు వలస వచ్చాడు. స్థానికంగా ఉన్న ఎస్‌ఆర్ హేచరీస్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తున్నాడు.
సిరాజ్‌కు నిత్యం ఉదయం వ్యాయామం చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలో రోజు మాదిరిగానే శుక్రవారం కూడా వ్యాయామం చేస్తుండగా ప్రమాదవశాత్తు డంబెల్స్ మీదపడి మృతి చెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ లింగయ్య తెలిపారు.
![death by dumbbells](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10992212_collage2.jpg)
ఇదీ చదవండి: నల్లపోచమ్మ ఆలయంలో చోరీ.. హుండీని ధ్వంసం చేసిన దుండగులు