ఆంధ్రప్రదేశ్‌లో 2019లో 214 మంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడగా.. 2020లో ఆ సంఖ్య 358కి చేరింది. 2019లో 2,167 మంది రోజు కూలీలు ఆత్మహత్య చేసుకోగా 2020లో ఆ సంఖ్య 2,501కి పెరిగింది. గతేడాది రాష్ట్రంలో రోజుకు సగటున 6-7 మంది రోజు కూలీలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన ‘‘ప్రమాద మరణాలు- ఆత్మహత్యల సమాచార వార్షిక నివేదిక-2020’’ ఈ వివరాలు వెల్లడించింది. గతేడాది ఏపీ వ్యాప్తంగా మొత్తం 7,043 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. వారిలో 2,501 మంది (35.51 శాతం) మంది రోజు కూలీలే కావటం తీవ్రతకు అద్దం పడుతోంది. వీరిలో ఎక్కువ మంది అల్పాదాయం, కుటుంబ సమస్యలతోనే బతుకు ముగించుకున్నారు.
అనారోగ్యం.. కుటుంబ సమస్యలు...అప్పులు
- గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న వారిలో 4,871 మంది (69.16 శాతం) అనారోగ్యం, కుటుంబ సమస్యలు, అప్పుల వల్లే ప్రాణాలు తీసుకున్నారు.
- బలవంతపు చావులకు పాల్పడిన వారిలో 5,488 మంది (77.92 శాతం) వివాహితులే.
- అతి తక్కువ ఆదాయం కలిగిన వర్గాల్లోనే ఎక్కువ బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రాణాలు తీసుకున్న వారిలో 3,902 మంది (55.40 శాతం) రూ.లక్ష అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారే.
ఇవీచదవండి: నిన్న లైవ్లో ఉరి.. నేడు వాగులో దూకి.. మాజీ మిస్ తెలంగాణకు ఏమైందీ..?
Suicide: తండ్రి మందలించాడని... రైలు కింద పడిన కుమారుడు
స్త్రీగా మారదామనుకున్న యువకుడు.. సర్జరీకి డబ్బుల్లేక ఆత్మహత్య