ETV Bharat / crime

పెంపుడు కుక్కను కాపాడేందుకు వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు - badradri district latest news

పెంపుడు కుక్కను కాపాడేందుకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Two young men missing in Godavari in bhadradri district
గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు
author img

By

Published : Apr 2, 2021, 7:50 AM IST

Updated : Apr 2, 2021, 12:30 PM IST

పెంపుడు కుక్కను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతె పట్టినగర్‌ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.

తాళ్లగొమ్మూరుకు చెందిన జమ్మి షణ్ముఖరావు, వడ్లమూడి చక్రి, సారపాక రిక్షా కాలనీకి చెందిన హరిచందులు మోతె పట్టినగర్‌ సమీపంలో గోదావరిలో స్నానానికి వెళ్లారు. హరిచందు పెంపుడు శునకాన్ని తీసుకెళ్లాడు. కుక్క నీటిలోకి వెళ్తుండటంతో కాపాడే ప్రయత్నంలో ముగ్గురు స్నేహితులు లోనికి వెళ్లారు. ఈ క్రమంలో హరిచందు, షణ్ముఖరావులకు ఈత రాకపోవడంతో గోదావరిలో గల్లంతయ్యారు. ఈ సమాచారాన్ని చక్రి స్థానికులకు తెలపడంతో రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు.

గజ ఈతగాళ్లతో రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా గల్లంతైన యువకుల ఆచూకీ లభ్యం కాలేదు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. మోతె పట్టినగర్‌కు చెందిన సొసైటీ అధ్యక్షుడు బిక్కసాని శ్రీనివాసరావు ఘటనా స్థలంలోనే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

Two young men missing in Godavari in bhadradri district
యువకుల కోసం గాలింపు

గోదావరి ఒడ్డున పడిగాపులు: జమ్మి సత్యనారాయణ-నాగమణి దంపతుల రెండో కుమారుడు షణ్ముఖరావు పాల్వంచలో బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సారపాకకు చెందిన వెంకటేశ్వర్లు-పుల్లమ్మ దంపతుల రెండో కుమారుడు హరిచందు బీటెక్‌ పూర్తి చేసి ఐటీసీలో ఇటీవలే విధుల్లో చేరారు. వీరి గల్లంతుతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా గోదావరి ఒడ్డునే రోదిస్తున్నారు.

ఇదీ చూడండి: కెనడాలో నల్గొండ జిల్లా విద్యార్థి ఆత్మహత్య

Last Updated : Apr 2, 2021, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.