రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఆలూరుకు చెందిన శ్రవణ్ (22), కొండాపూర్‌కు చెందిన నవీన్(30)గా గుర్తించారు. కౌకుంట్లకు చెందిన మహేందర్ రెడ్డి, ఉదయ్ కిరణ్‌లు గాయాల పాలయ్యారు.
యువకులు మద్యం సేవించి కారును అతివేగంగా నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి ఢీ కొట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులోని మృతదేహాలను గంటపాటుు జేసీబీతో శ్రమించి బయటకు తీశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్ననట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: నాకే పునుగులిస్తావా.. నీ అంతుచూస్తా..