ETV Bharat / crime

రెండు టన్నుల చేపలు మృత్యువాత - రెండు టన్నుల చేపలు మృతి

చేప పిల్లలను పెంచి... పెద్ద చేసి... సరిగా మార్కెట్​ తీసుకెళ్లి సొమ్ము చేసుకుందామనేసరికి చేపలన్ని చనిపోయాయని మత్స్యకారులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Two tons of fish die in sujatha nagar in bhadradri kothagudem district
రెండు టన్నుల చేపలు మృత్యవాత
author img

By

Published : Apr 11, 2021, 1:37 PM IST

Updated : Apr 11, 2021, 2:00 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్​ మండలంలోని సింగభూపాలెం చెరువులో సుమారు రెండు టన్నుల చేపలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటనతో మత్స్యకార సొసైటీ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

ఇంతకాలం చేపలను పెంచి కంటికి రెప్పలా కాపాడుకున్నామని... మార్కెట్​ చేసుకుని ఆర్థికంగా లాభం చేకూరే సమయంలో తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. కానీ చేపలు చనిపోవడానికి గల కారణాలు తెలియట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా చేపలు మృత్యువాత పడిఉండొచ్చని మత్స్యశాఖ అధికారిని అనుమానం వ్యక్తం చేశారు. ల్యాబ్​ టెస్టింగ్ రిపోర్ట్​ రావాల్సి ఉందన్నారు. చనిపోయిన చేపలను పెద్ద గోతిలో పూడ్చిపెడతామని తెలిపారు.

ఇదీ చూడండి: ఓటర్ల కోసం 2 క్వింటాళ్ల జిలేబీలు, 1000 సమోసాలు

Last Updated : Apr 11, 2021, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.